వైరల్ వీడియో: అసలైన స్వేచ్ఛ.. పక్షుల స్వేచ్ఛని హరించకండి..!

ఈ సమస్త భూ ప్రపంచంలో మనిషి కారణం గా ఎన్నో జీవులు బలవుతాయి.సింహాలు, పులులు, ఏనుగులు, పాములు ఇలా ఎన్నో జీవరాశులను చంపేసి లేదా బంధించి మానవులు బతుకుతున్నారు.

 Viral Video True Freedom Do Not Deprive The Birds Of Their Freedom Shared By Par-TeluguStop.com

అయితే భూమ్మీద సంచరించే వన్యప్రాణులు మాత్రమే కాదు.గాల్లో ఎగిరే పక్షులను కూడా మానవులు పట్టుకుంటున్నారు.

హాయిగా గాల్లో ఎగురుతూ తమ జీవితాన్ని ఆనందించే పక్షులను వల వేసి పట్టుకొని పంజరాల్లో బందిస్తున్నారు.పక్షుల ప్రేమికులు ఉంటారు కదా.వారి డిమాండ్ మేరకు పక్షులను విక్రయించేందుకు కొందరు వేటగాళ్లు రక రకాల పక్షులను పట్టుకుంటున్నారు.

అయితే వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు వేటగాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

ఇరుకైనా ఇనుప పంజరంలో వందల పక్షులను కుక్కి పంపిస్తున్నారు.పక్షుల తలలకు ఏదో ఒక చిన్న సంచి లాంటివి తొడిగి ఒక గోనే బస్తాలో ఆ పంజరాన్ని కవర్ చేసి తరలిస్తున్నారు.

అయితే ఆ ఇరుకైన పంజరంలో గాలి ఆడక ఇతర పక్షుల బరువు మోయలేక కొన్ని వందల పక్షులు నరకయాతన పడుతున్నాయి.

అయితే పక్షులను ఎంత క్రూరంగా బంధించి ఇబ్బందులు పెడుతున్నారో తెలియజేయడానికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ తన ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేశారు.ఆ ఫోటోలో కనిపిస్తున్న రామచిలక లను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కు పోవడం ఖాయం.అయితే లోకల్ మార్కెట్ నుంచి పక్షులను కొనుగోలు చేసేవారు.

ఆ పక్షులను ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారో తెలుసుకోవాలని పర్వీన్ సూచిస్తున్నారు.ఎప్పుడూ కూడా లోకల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయొద్దని.

అలా చేస్తే ఎన్నో పక్షులు మానవుల క్రూరత్వానికి గురవుతాయని ఆయన అన్నారు.అయితే పర్వీన్ ఇంకొక వీడియోను పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో అటవీ అధికారులు వేటగాళ్లు పట్టుకున్న వందల చిలకలను విడుదల చేయడం చూడొచ్చు.స్వేచ్ఛా అనేది ఇలానే ఉంటుంది అని ఆ వీడియోకి పర్వీన్ ఓ కాప్షన్ ను జత చేసి చేశారు.

అయితే పక్షులను పెంచడం నేరమని.అవి గాల్లో విహరించే జీవులు అని.పంజరంలో పక్షులను బంధించి తమని తాము పక్షి ప్రేమికులమని చెప్పుకోవడం తప్పు అని నెటిజన్లు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube