వైరల్ వీడియో: బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఆ ట్రక్ డ్రైవర్ ఏకంగా..?!

కొన్ని కొన్ని సార్లు వాహ‌నాలు డ్రైవింగ్ చేసే వాళ్ల‌ను చూస్తుంటే నిజంగా ఆశ్చ‌ర్యం వేస్తుంటుంది.కొంద‌రు ట్ర‌క్కుల‌ను వేగంగా న‌డుపుతుంటారు మ‌రికొంద‌రు అటూ ఇటూ తిప్పుతూ ప్ర‌మాద‌క‌రంగా డ్రైవింగ్ చేస్తారు.

 Viral Video Truck Driver Drives Truck In Reverse Gear Due To Break Fail In Mahar-TeluguStop.com

ఇలా వాళ్లు న‌డిపే ట‌ప్పుడు వీడియో తీస్తే అవ్వి ఈజీగా ల‌క్ష‌ల్లో వ్యూస్ ను సొంతం చేసుకుంటాయి.ఇప్పుడు కూడా నెట్టింట అలాంటి ఓ ట్ర‌క్కు వీడియోనే హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అదేంటో ఓ లుక్ వేద్దాం.

రోడ్డుమీద విప‌రీతంగా వాహ‌నాలు వెల్తుంటే ఓ ట్రక్ మాత్రం రివ‌ర్స్‌లో వెళ్తుంది.

ఏకంగా ఆ డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం రివర్స్ గేర్‌లో వాహనాన్ని నడుపాడు.ట్రక్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుకు వెళ్తే ప్రమాదమని భావించి అలాగే ట్రక్ రివర్స్ గేర్ లో డ్రైవ్ చేశాడు.

అయితే ఒక్క వాహనాన్ని కూడా అత‌డు ఢీకొట్ట‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

ఈ రివ‌ర్స్ డ్రైవింగ్ ఘటన మహారాష్ట్రలోని జల్నా- సిల్లోడ్ హైవేపై జరిగింది.

వంద‌లాది వాహ‌నాల న‌డుమ ఆ ట్ర‌క్ డ్రైవ‌ర్ రివర్స్ గేర్ లో వెళ్తుంటే.కొంతమంది బైకర్లు ట్రాఫిక్ క్లియర్ చేశారు.రోడ్డుపై ట్రక్ డ్రైవర్ రివర్స్ గేర్‌లో మూడు కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.అలా వెళ్లిన వాహనాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రక్కును చివ‌ర‌కు పొలాల్లోకి తిప్పాడు డ్రైవ‌ర్‌.

దీంతో ఆ ట్ర‌క్కు వేగాన్ని కంట్రోల్ చేశాడు డ్రైవ‌ర్‌.

అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.అంతే కాదు చాలామంది అత‌డిని మెచ్చుకుంటున్నాఉ.డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బైకర్ల సాయంతో పెద్ద రోడ్డు ప్రమాదాన్ని తప్పించాడు.

ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో కనిపించిన ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకు 13 లక్షలకు పైగా వ్యూస్ వ‌చ్చాయి.వేలాది కామెంట్లు వ‌స్తున్నాయి.అంద‌రూ డ్రైవ‌ర్‌ను ప్ర‌శంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube