సాధారణంగా పులిని చూడాలనుకుంటే జూకు వెళ్లాల్సి ఉంటుంది.చాలా మంది చిన్నపిల్లలు పులిని సినిమాలలో చూసి ఒకరకమైన భయం ఉంటుంది.
కాని దానిని నిజంగా చూస్తే వారు చాలా ఆనందిస్తారు.అందుకే ఎక్కువగా చిన్నపిల్లలను తీసుకొని ఎక్కువగా పర్యాటకులు జూ లకు విచ్చేస్తారు.
కాని అక్కడ జంతువులను చూసిన ఆనందంలో కొంచెం హుషారు ఎక్కువవుతుంది.మామూలుగా అయితే జూ లో పులిని చూశామంటే మనం దానిని దగ్గర ఉంటే ఫోటో తీసుకోవాలి లేదా దూరం ఉంటే చూసి వెళ్ళిపోవాలి.
అలా కాక నిశ్శబ్దంగా ఉన్న పులిని రెచ్చగొడితే ఏమవుతుంది.దాని తడాఖా ఏంటో చూపిస్తుంది.
సరిగ్గా ఇలాంటి ఘటనే ఓ జూలో జరిగింది.
ఒక జూలోకి పర్యాటకులు వెళ్లారు.
కాని అలా జూలో ఓపెన్ టాప్ జీపులో జూలోని జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక పులి దగ్గరకు రాగానే చూసిన వాళ్ళు చూసినట్టు ఉండకుండా దానిని అరుపులు కేరింతలతో పెద్ద ఎత్తున అరవడంతో గోడ ప్రక్కన ఉన్న పులి కాస్త ఒక్కసారిగా ఎగిరి గోడ మీదకి దూకింది.
ఒక్కసారిగా పర్యాటకుల ప్రాణాలు పోయినంత పనైంది.కాని ఆ పులి సైలెంట్ గా మరల గోడ దూకేసి వెళ్ళిపోయింది.
ఒక్కసారిగా ఈ ఘటనతో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టాయి.ఏది ఏమైనా మన హద్దుల్లో మనం ఉంటే వాటి హద్దుల్లో అవి ఉంటాయని ఈ ఘటన ద్వారా అర్ధమవుతుంది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.