సానియా మీర్జా అంటే భారత క్రీడా దిగ్గజం అని తిరుగులేని సమాధానం వినిపిస్తుంది.ఆమె భారత్ తరపున అనేక విజయాలను అందుకుంది.
దేశానికి ఎనలేని గౌరవం తెచ్చిపెట్టింది.తాజాగా టోక్యో ఒలంపిక్స్ గేమ్ లో కూడా ఆమె ఎంపికైంది.
మెగా క్రీడా ఈవెంట్ ఒలింపిక్ ఆటకు సానియా మీర్జా కొద్ది నెలల క్రితమే అర్హత సాధించింది.దీంతో ఈ మధ్యనే ఆమె ఒలింపిక్ కిట్ ను అందుకుంది.
ఆ సందర్భంగా ఆమెకు ఎంతో ఆనందం కలిగింది.జులై 23వ తేదిన ఒలింపిక్ జరగనుండగా దాని కోసం ఆమె ఎంగానో ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసింది.దీంతో సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసిన ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అమెరికన్ ర్యాపర్ డోజా క్యాట్స్ పాడిన పాట అయిన కిస్ మీ మోర్ పాటను పాడుతూ ఆమె కొన్ని స్టెప్పులేసి డ్యాన్స్ ను ఇరగదీసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.తన పేరులో ఉండే ‘ఎ’ అనే అక్షరం తన జీవితంలో ఎంతో విలువైనదిగా సానియా చెప్పుకొచ్చింది.‘ ఎ ‘ అనే అక్షరం పై క్యాప్షన్ రాసి వీడియోను పోస్టు చేసింది.‘ఎ’ అంటే అగ్రెస్సివ్, యాంబిషన్, అచీవ్, అఫెక్షన్ అని చెబుతూ ఆమె వివరించింది.
ఆమె పోస్టు చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఆ పోస్టుకు పెద్దసంఖ్యలో లైకులు, కామెంట్స్ వచ్చాయి.సానియా పోస్టుకు కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్యా బిర్లా స్పందిస్తూ.
నీ డాన్స్ మూమెంట్స్ అంటే తనకి చాలా ఇష్టమని.కంగ్రాట్స్ చెబుతూనే.
ఆ పోస్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ మీరు కూడా ఈ వీడియో చూసేయండి.