వైరల్ వీడియో: నీళ్ల దెబ్బకి బెంబేలెత్తిన చిరుత..!

అడవిలో ఏ ప్రదేశం లో ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఎవరూ ఊహించలేరు.ఊహించని ఘటనలతో ప్రాణాలు విడిచిన వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి.

 Viral Video Tiger Walking On Thin Ice Got Shocked When It Breaks-TeluguStop.com

అయితే సమయస్ఫూర్తితో తప్పించుకోగలిగిన వన్యప్రాణులు కూడా చాలా ఉన్నాయి.ఒక చిరుత పులి కూడా ఒక పెద్ద ప్రమాదం నుంచి రెప్పపాటు సమయంలో తప్పించుకొని తన ప్రాణాలను నిలబెట్టుకో గలిగింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 Viral Video Tiger Walking On Thin Ice Got Shocked When It Breaks-వైరల్ వీడియో: నీళ్ల దెబ్బకి బెంబేలెత్తిన చిరుత..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్తి వివరాలు తెలుసుకుంటే.

నేచర్ అండ్ అనిమల్స్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ లో పులి కి సంబంధించిన వీడియో షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక పెద్ద చిరుతపులి గడ్డకట్టిన మంచు పై ప్రశాంతంగా నడుస్తోంది.

ఈ క్రమంలోనే పులి సన్నగా పేరుకుపోయిన మంచు పై కాలు పెట్టింది.దీంతో ఆ మంచు పొర ఒక్కసారిగా విరిగిపోగా.

పులి ఉలిక్కి పడింది.వెంటనే జింక మాదిరి గెంతులు వేస్తూ పులి ఆ మంచు నీటి నుంచి బయటపడ గలిగింది.

నిజానికి ఈ మంచు నీటి చుట్టూ ఎత్తైన గట్టు లాంటిది కట్టారు.ఒకవేళ పులి అప్రమత్తంగా లేకపోయినట్లయితే మంచు లోపలకి వెళ్ళి పోయేది.

అలాగే బయటపడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.మంచు నీటిలో చిక్కుకుపోతే బయటికి రావడం మనుషులకే కష్టంగా ఉంటుంది.

అలాంటిది జంతువులకు మరింత కష్టంగా ఉంటుంది.కానీ పులి చాకచక్యంగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.

అయితే పులి ప్రాణాలతో బయట పడటంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు.కొందరు నెటిజన్లు “ప్రశాంతంగా నడుస్తున్న పులికి వాటర్ ఝలక్ ఇచ్చిందటూ” సరదాగా కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ పులి వీడియో కి ఇప్పటికే ఒక లక్షా తొంబై వేల వ్యూస్ వచ్చాయి.అలాగే దాదాపు రెండువేల లైకులు వచ్చాయి.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.మీరు కూడా ఈ వీడియోని వీక్షించండి.

#TigerWalking #Social Media #Viral Video #Water #Lion

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు