వైరల్ వీడియో: ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డ్ ను బాగా వాడేసుకున్న టిక్ టాక్ యూజర్.. ఎలాగో మీరే చూడండి..!

ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.గత నాలుగు రోజుల ముందు ఆయనకు సంబందించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేసింది.

 Viral Video Tick Tock User Who Made Good Use Of Football Player Ronald See For Yourself-TeluguStop.com

ఆయన మీడియా సమావేశంలో కోకోకోలాకు సంబందించిన కూల్ డ్రింక్స్ బాటిళ్లను పక్కన పెట్టారు.మీడియా ముందు అలా చేయడం వల్ల కోకోకోలా కంపెనీపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది.

ఆ కంపెనీ షేర్లు చాలా వరకూ తగ్గిపోయాయి. స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఇలా చేయడం పట్ల పలువురు పెద్దలు పెదవి విరిచారు కూడా.

 Viral Video Tick Tock User Who Made Good Use Of Football Player Ronald See For Yourself-వైరల్ వీడియో: ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డ్ ను బాగా వాడేసుకున్న టిక్ టాక్ యూజర్.. ఎలాగో మీరే చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాను పోషక విలువలు కలిగిన పదార్థాలను పాటిస్తానని అందుకే కొక్ కు బదులుగా వాటర్ తాగుతానని రొనాల్డో చెప్పడం విశేషం.

ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో రొనాల్డో కోకోకోలా బాటిళ్లను పక్కకు పెట్టాడు.దానిపై మీమ్స్ పేలుతున్నాయి.

ఆ వీడియోపై చాలా మంది సీన్ రీ క్రియేట్ చేస్తూ వీడియోను మార్చి పోస్టులు పెడుతున్నారు.ఆ వీడియోలన్నీ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి.

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ టిక్ టాక్ యూజర్ రొనాల్డో వీడియోపై మీమ్స్ చేశాడు.రోనాల్డో కోకోకోలా కూల్ డ్రింక్ బాటిళ్లను పక్కకు పెడుతుండగా ఇక్కడ తాను అడిగినట్లు అందుకు రొనాల్డో బాటిళ్లను తీసి ఇస్తున్నట్లు వీడియో క్రియేట్ చేశాడు.ఈ వీడియోను చూసి పలువురు నవ్వును ఆపుకోలేకపోతున్నారు.

టిక్ టాక్ యూజర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది.అతను యాక్టింగ్ ఇరగదీశాడని కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ యూజర్ అయిన బీ అభిషేక్‌ గురేజా అనే వ్యక్తి టిక్‌ టాక్ యూజర్ చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పలువురు ఫన్నీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.రోనాల్డో పై ఇలా రోజుకోక వీడియో ట్రెండింగ్ అవుతోంది.

#Viral Video #Episode #Coca Cola #Viral #Tiktok

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు