వైరల్ వీడియో: భూమిమీద నూకలు మిగలడం అంటే ఇదే.. సెకన్ లేట్ చేసినా ఛాల్తీ గల్లంతయ్యేది?

మనం సిటీలలో నిత్యం చూస్తూ ఉంటాం.ఏదో కొంపలు మునిగిపోయినట్టు జనాలు బస్ రన్నింగ్ లో ఉంటుండగా ఎక్కుతూ వుంటారు.

 Viral Video This Is What It Means To Be Left On The Ground , Train Passenger , Railway Protection Force, Rpf Staff, City Of Mumbai , Country Of Brazil-TeluguStop.com

అలాగే రైళ్లు ఎక్కినవారిని కూడా మనం అనేక మందిని చూడవచ్చు.విశ్వాసమో, అతి విశ్వాసమో తెలియదు కానీ ఇలా చాలామంది కదిలే బస్సులు, ట్రైన్లను ఎక్కడం, దిగడం చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చనిపోయిన ఘటనలు కూడా మనం చదువుతున్నాం, చూస్తున్నాం.అయినా కొంతమంది మారడం లేదు.

 Viral Video This Is What It Means To Be Left On The Ground , Train Passenger , Railway Protection Force, RPF Staff, City Of Mumbai , Country Of Brazil-వైరల్ వీడియో: భూమిమీద నూకలు మిగలడం అంటే ఇదే.. సెకన్ లేట్ చేసినా ఛాల్తీ గల్లంతయ్యేది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా నేటి యువత వింత పోకడలకు పోయి, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి సంఘటన ముంబై నగరంలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి, ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది.ఇక వీడియో వివరాల్లోకి వెళితే, ఓ ప్రయాణికుడు వేగంగా వెళ్తున్న ఓ ట్రైన్ ను ఎక్కేందుకు యత్నిస్తాడు.

అయితే, ఈ సమయంలో అతను పట్టు కోల్పోయి, కింద పడతాడు.దీంతో కొన్ని సెకండ్ల పాటు ట్రైన్ అతడిని తాకుతూ వెళ్లింది.ఇది గమనించిన ప్రయాణికులు, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కు చెందిన కానిస్టేబుల్ ఠాకూర్ ఆ ప్రయాణికుడు పట్టాలపై పడిపోకుండా ప్లాట్ ఫారంపైకి లాగేశాడు.దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రస్తుతము దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇందులో ఆ ప్రయాణికుడికి గాయాలు అయినట్టు కూడా తెలుస్తోంది.ఇక సదరు వీడియోని తిలకించిన నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా ఆర్పీఎఫ్ సిబ్బందిని అభినందిస్తున్నారు.మరి కొందరు ప్రయాణికులు ఆ ప్రయాణికుడిని హెచ్చరిస్తున్నారు.

ఇంకొంతమంది మాత్రం రైలు ప్రారంభం కాగానే మూసుకుపోయేలా అటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని రైల్వే వాళ్లకు సూచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube