వైరల్ వీడియో: బహుశా ప్రేమాభిమానాలు అంటే ఇవే కాబోలు..!

ఈ సమాజంలో బంధాలకి, బంధుత్వాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.కానీ తరాలు మారుతున్న కొద్ది మనుషులలో మార్పు అనేది వచ్చేసింది.

 Viral Video This Is The Real Love Between The Grand Parents And Children, Grandp-TeluguStop.com

ఒకప్పటిలాగా కుటుంబాలు కలిసి ఉండడం లేదు.అప్పట్లో అంతా ఒక్కచోటనే కలిసి మెలిసి ఉండి ప్రేమ ఆప్యాయతలను పంచుకునే వారు.

కానీ ఈ కాలంలో మేము ఇద్దరం, మాకు ఇద్దరు అన్నట్లు కాలం గడిపెస్తున్నారు.కని పెంచిన తల్లి తండ్రులను సైతం అనాధలుగా వదిలేస్తున్నారు.

వృద్ధాప్యంలో ఎంచక్కా మనవళ్లతో, మనవరాళ్లతో కాలం గడపాలిసిన వారు ఒంటరి జీవితం గడిపేస్తున్నారు.అలా నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమాభిమానాలు పొందిన చిన్నారులు నిజంగానే అదృష్టవంతులని చెప్పాలి.

కానీ ఇప్పటి కాలంలో చాలామంది చిన్నారులు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి దూరంగా బతుకుతున్నారు.ఎప్పుడో అమావాస్యకో, పౌర్ణమికో ఒక కాల్ చేయడమో లేదంటే వీడియో కాల్ చేయడమో చేస్తున్నారు తప్ప వాళ్ళతో మాత్రం జీవించలేకపోతున్నారు.

అటు పిల్లలకు నానమ్మ,అమ్మమ్మ, తాతయ్య ప్రేమ లేదు.ఇటు వీళ్ళకి కూడా మనవళ్లు, మానవరాళ్ల ప్రేమ లభించడం లేదు.అయితే ఈ క్రమంలో తాత మనవళ్ల ప్రేమకు నిదర్శనంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టకుండా ఉండలేరు.

ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు వాళ్ళ తాతయ్యను చూసి ఒక్కసారిగా ఆనందంలో గెంతులేయడం మనం చూడవచ్చు.దాదాపు 6 నెలల తర్వాత ఈ ఇద్దరు చిన్నారులు వాళ్ళ తాతని మొట్ట మొదటిసారి చూడడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి.

ఒకసారి వీడియోను గమనిస్తే అందులో మనకు ఒక పెద్దయన స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న తన ఇద్దరు మనవళ్ల కోసం ఇంటి వరండాలో వేచి చూస్తూ ఉండడం మనం చూడవచ్చు.

ఆ చిన్నారులు గేట్ తీసుకుని లోపలకు రాగానే వాళ్ళ తాతని చూసి ఆనందంతో గెంతులెయ్యడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు.ఇద్దరు గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతను కౌగలించుకుంటారు.పిల్లలను చూసిన ఆనందంతో ఆ పెద్దాయన కూడా బాగా మురిసిపోతాడు.దాదాపు ఒక అర్ధ సంవత్సరం పాటు ఈ తాత మనవళ్లు విడివిడిగా ఉంటున్నారు.ఒక్కసారిగి ఒకరినొకరు చూసుకోగానే ఉత్సహంతో గ్రౌండ్ అంతా పరుగులు పెట్టడం ఈ వీడియోలో చూడవచ్చు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube