వైరల్ వీడియో : ఇదేం కోతిరా బాబు..ట్రైనర్ నే కత్తితో బెదిరిస్తూ..!

కోతులు చేసే అల్లరి చేష్టలు మాములుగా ఉండవు.ఒక కోతి మందు తాగిత ఒక కోతి కన్ను కొడుతుంది.

 Viral Video: This Is Kotira Babu..trainer Threatening With A Knife  Viral Video,-TeluguStop.com

ఒక కోతి సర్కస్ చేస్తే మరో కోతి స్టెప్పులేస్తోంది.ఇలా ప్రతీ రోజూ కోతులకు సంబంధించిన ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

ఎందుకంటే కోతి అంటేనే అల్లరి అల్లరి అంటేనే కోతిమన ఇంట్లో ఎవరైనా అల్లరి చేస్తే చాలు కోతి చేష్టలు ఆపుతావ అంటూ పిల్లలపై పెద్దోళ్ళు డైలాగ్ లు వేస్తూనే ఉంటారు.ఇలా చిలిపి పని చేసినా ప్రతీసారి కోతినే తలుచుకుంటాం కదా.అయితే ఈ సారి ఓ కోతి ట్రెండ్ మార్చింది.ఏకంగా కత్తిని పట్టుకొని కారాలు, మిర్యాలు నూరుతుంది.

దాని ట్రైనర్ కే కత్తి చూపిస్తూ ఏదో యుద్దానికి వెళ్తున్నట్టు బిల్డప్ కొడుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది.నెట్టింట ఆ కోతి చేసిన హంగామా అంతా.

ఇంతా కాదు.మరి ఈ రౌడీ కోతి కథ ఏంటో చూద్దాం రండి.

వీడియో ఓపెన్ చేయగానే రోడ్డు పై ఓ కోతి.పక్కనే దాని ట్రైనర్.కోతి మెడలో ఓ తాడు, చేతిలో ఓ కత్తి పైగా యుద్దానికి వెళ్తున్నట్టు ఓ లుక్.కోతికి మెడకు కట్టిన తాడును ట్రైనర్ లాగగానే చిర్రెత్తుకొచ్చినట్టు ఆ కోతి ఒక్కసారిగా లేచి చేతిలోని కత్తిని నెలకు రాస్తూ చేసిన యాక్షన్ అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించింది.

తాడు లాగిన ప్రతిసారీ ట్రైనర్ ని కత్తితో బెదిరిస్తూ ఆ కోతి చేసిన సీన్ మాములుగా లేదు అంటే నమ్మండి.మరి ఈ వీడియో ఎవరూ తీసి పోస్ట్ చేశారు అన్నది తెలియదు గాని, ఈ రౌడీ కోతి అయితే ఫుల్ లైకులు కొట్టేసింది.

అదిచ్చిన ఎక్స్ప్రెషన్ చూసిన ప్రతీ ఒక్కరూ తెగ నవ్వేసుకున్నారు.ఏది ఏమైనా కొత్త ట్రెండ్ తో ముందుకొచ్చిన ఈ రౌడీ కోతి తన ఓవర్ యాక్షన్ తో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube