వైరల్ వీడియో: ఈ కుర్రాడి ప్రతిభ అమోఘం.. ట్రెయిన్ చేస్తే ఖచ్చితంగా ఒలింపిక్స్ మెడల్ తెస్తాడు!

కవితకు కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతిభకు కారెవరు అనర్హలని ఖచ్చితంగా అనాలి.ఎందుకంటే టేలెంట్ ఎవడబ్బసొత్తు కాదు.

 Viral Video This Guys Talent Is Amazing He Will Definitely Bring An Olympics Me-TeluguStop.com

ఆర్థిక పరిస్థితికి దానికి సంబంధం అసలే లేదు.డబ్బున్నవారే టాలెంట్ ని కలిగి వుంటారు, లేనివారికి అంత లేదు అన్న రోజులు పోయాయి.

ప్రపంచం ఇపుడు ఓ కుగ్రామం అయిపోయిది.సోషల్ మీడియా విస్తృతి పెరిగింది.

దాంతో ఎక్కడో మారుమూలన వున్న పల్లెల్లో గల కళాకారులు బయటకు వస్తున్నారు.ముఖ్యంగా అత్యంత ప్రతిభావంతులైనవారి వీడియోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ టాలెంటెడ్ కుర్రాడి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది.

అవును.

అతడు ఓ స్లమ్ ఏరియాలోనే ఉంటాడు.అయితేనేం తన ప్రతిభను ప్రదర్శించాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, స్లమ్ ఏరియాలో కొంతమంది నిలబడి ఉన్నారు.అదే సమయంలో ఒక పిల్లవాడు సడెన్ గా చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ.

అక్కడ ఉన్న చెత్త ఉన్న ప్రాంతాలో చేసిన ఫీట్ అందరినీ ఆకట్టుకుంది.బాలుడు ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడిలా, అచ్చం ఓ ప్రొఫెషనల్ గా చేసిన స్టంట్‌ చూసి ఆశ్చర్యపోతారు.

బాలుడు పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్లి, అక్కడ గాలిలో ఎగిరి.ఫల్టీలు కొడుతూ.

తిరిగి నేలమీద చేరిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

అయితే, ఆ వీడియో వివరాలు మాత్రం మనకు తెలియనప్పటికీ.ఇది స్లమ్ ఏరియాలో జరిగిన సంఘటన అని తెలుస్తోంది.ఈ వీడియో @TheFigen అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది.

దీనితో బ్రావో బేబీ అని క్యాప్షన్ తో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియోకు 4.5 లక్షలకు పైగా వ్యూస్ రాగా, వేలల్లో కామెంట్లు ఉపెడుతున్నారు.ఎవరైనా ఆ బాలుడి ప్రతిభకు పదును పెట్టేలా అతనికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్ చేస్తే.

ఆ బాలుడు ఉన్న దేశం ప్రభుత్వం అతనికి అన్ని విధాలా వెన్నుదన్నుగా ఉండాలని కోరుతున్నట్లు మరొకరు కామెంట్ చేయడం విశేషం.మీరు కూడా దాన్ని ఓసారి తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube