వైరల్ వీడియో: జీవితంలో ఇలాంటి స్నేహం ఉండాల్సిందే..!  

Viral video There must be such a friendship in life dog rescues girl, Viral latest, viral video, tarak dialogue, social media, viral, indian forest service officer, sushanta nanda, twitter, dog, saves, girl - Telugu Dog, Girl, Indian Forest Service Officer, Saves, Social Media, Sushanta Nanda, Tarak Dialogue, Twitter, Viral, Viral Latest, Viral Video

మానవత్వం మంటగలిసి పోతున్న ఈ రోజుల్లో కుక్కలు మనుషులపై చూపించే నిష్కపటియైన ప్రేమ చాలా గొప్పది గా కనిపిస్తోంది.టెంపర్ సినిమా లో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ చేత చెప్పించిన డైలాగ్స్ మీకు గుర్తుకి ఉండొచ్చు.‘మనుషులను అన్‌ కండిషనల్‌గా లవ్ చేసేది కుక్క మాత్రమే.అది సాటి కుక్క కంటే మనుషుల్ని ఎక్కువ లవ్ చేసిద్ది.

TeluguStop.com - Viral Video There Must Be Such A Friendship In Life Dog Rescues Girl

అసలు మనుషులకు కావాల్సింది మానవత్వం కాదు కుక్కతత్వం,’ అని హీరో తారక్ హీరోయిన్ కాజల్ తో టెంపర్ సినిమాలో చెబుతారు.ఐతే తారక్ చెప్పినట్టు ఆస్తుల కోసం సొంత వారినే కడతేర్చే నేటి సమాజంలో మానవత్వం కంటే కుక్కతత్వమే గొప్పదని తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చెప్పకనే చెబుతుంది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ శుశాంత నందా తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.

TeluguStop.com - వైరల్ వీడియో: జీవితంలో ఇలాంటి స్నేహం ఉండాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ వీడియోలో ఒక బాలిక బాల్ ఆట ఆడుకుంటూ.బంతిని నీళ్లల్లో విసిరేసింది.

ఆ బంతి నీటిలో కొట్టుకు పోతుంటే.అది తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు బాలిక నీటిలోకి వెళ్ళబోయింది.

ఇది గ్రహించిన ఓ పెంపుడు కుక్క వెంటనే ఆ బాలిక డ్రెస్ నోటితో పట్టుకొని నీళ్ళల్లోకి వెళ్లకుండా వెనక్కి లాగింది.అనంతరం నీటిలో పడిపోయిన బంతిని తీసుకొచ్చి ఆ పాప కి ఇచ్చింది.

అయితే ఈ అద్భుతమైన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఈ కుక్క తమ యజమానుల ప్రాణాలను కాపాడడానికి చేసే ప్రయత్నానికి ఫిదా అయిపోయిన ఐఎఫ్ఎస్ అధికారి.“మీకు అవసరం పడే కంటే ముందుగా కుక్కలతో సావాసం చేయటం ఉత్తమం” అని పేర్కొంటూ ఈ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఇదొక్కటే కాదు శునకాలు తమ యజమానుల ప్రాణాలను కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యి కుక్క మనుషులను ఎంత అమితంగా ప్రేమిస్తుందో నిరూపించాయి.

#SAVES #IndianForest #Girl #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు