వైరల్ వీడియో: అదిగో దెయ్యం...!

చాలామందికి దయ్యాలు భూతాలు అంటే చాలా భయం.వాటి పేర్లను వినగానే అవి నిజంగానే వచ్చి వారిని ఏమో చేస్తాయి అన్నట్లుగా తెగ హైరానా పడిపోతుంటారు.

 Viral Video There Is The Devil  Ghost , Viral Video, Youtube, Ghost Lovers , Com-TeluguStop.com

అయితే కొంతమందికి దయ్యాలు భూతాలు లాంటి హర్రర్ సినిమాలను ఎక్కువగా చూసే వారికి ఆల్ అంటే బాగా ఆసక్తిగా ఉంటాయి.కొంతమంది చీకటి ఉంటే చాలు అక్కడ ఏదో దుష్ట శక్తి ఉందని తెగ భయపడిపోతుంటారు.

అయితే కొంతమంది దెయ్యాలు ఉన్నాయని మరికొంతమంది దయ్యాలు లేవని వాదిస్తూ ఉంటారు.మరికొంతమంది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా గాలితో కదిలి వస్తే కింద పడితే అక్కడ ఏదో దెయ్యం ఉందని తెగ భయపడిపోతుంటారు.

అయితే కొన్ని సార్లు కొన్ని మీడియా చానల్ ద్వారా ప్రపంచంలో చాలా చోట్ల దెయ్యాలు ఉన్నాయని చెబుతుంటారు.అయితే పెద్దలు చెప్పిన ప్రకారం దెయ్యాలను మనుషుల కంటే ముందుగా మూగజీవాలు పసిగడతాయి అని అంటారు.

నిజానికి ఈ వీడియో చూస్తే అది నిజమే అని అనిపిస్తుంది ఏమో మరి.ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియోలో చూస్తే ఇంటి యజమానులు రెండు కుక్కలను ఇంట్లో పెట్టి వారు ఎక్కడికో బయటికి వెళ్లారు.అయితే అది ఇంట్లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి చూడగా అక్కడ ఎవరో ఉన్నారని ఆ రెండు కుక్కలు తెగ అరవ సాగాయి.

ఇక ఇది ఇలా ఉండగా అంతలోనే ఆ ఇంట్లోని సోఫా మీద ఉన్న ఒక బెడ్ షీట్ గాల్లోకి లేచి కింద పడుతుంది.ఇదంతా ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

అయితే బెడ్ షీట్ కదలడం ఇంట్లో ఉన్న రెండు కుక్కల లో ఒక కుక్క పసిగట్టి ఆ బెడ్ షీట్ దగ్గరకు వచ్చి మళ్లీ అరవసాగింది.ఇలా జరగడంతో ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అక్కడ కచ్చితంగా దెయ్యం ఉంటుంది కాబట్టి ఆ కుక్క అరుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరికొందరు నెటిజన్స్ ఆ కుక్కలను భయపెట్టడానికి ఎవరో కావాలని అలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.ఇక వారందరి సంగతి పక్కన పెడితే ఈ వీడియో చూసిన మీకు ఏమనిపిస్తుందో చెప్పండి మరి…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube