వైరల్ వీడియో: అచ్చం సినిమావలె మారువేషంలో దొంగను పట్టేసుకున్న రియల్ సింగం..!  

మామూలుగా దొంగలు పట్టుకోవడం ఏవిధంగా జరుగుతుందో అన్న విషయాలను మనం అనేక సినిమాలలో చూస్తూ ఉండే వాళ్ళం.అయితే అది నిజ జీవితంలో చూడడం చాలా అరుదు.

TeluguStop.com - Viral Video The Real Lion Who Caught The Thief In Disguise Like Achcham Movie

ఎందుకంటే సినిమాలో అన్ని స్క్రిప్ట్ పరంగా జరుగుతాయి కాబట్టి చూడటానికి బాగా కనిపించేలా వాటిని తీర్చిదిద్దుతూ ఉంటారు.అయితే తాజాగా ఓ రియల్ పోలీస్ మారువేషంలో దొంగలను పట్టుకున్న వీడియో కెమెరా కంటికి చిక్కడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇలా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - వైరల్ వీడియో: అచ్చం సినిమావలె మారువేషంలో దొంగను పట్టేసుకున్న రియల్ సింగం..-General-Telugu-Telugu Tollywood Photo Image

చెన్నై నగరానికి చెందిన ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు మాత్రం ఇలా పోలీసులను పట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది.

చెన్నై నగరంలో జరుగుతున్న అనేక మొబైల్ దొంగతనాల నేపథ్యంలో తాజాగా నగరంలోని జనాల నుంచి మొబైల్ ఫోన్లు పట్టుకునేందుకు ఆ పోలీస్ అధికారి మరు వేషంలో ఉంటూ దొంగను పట్టుకోవడానికి మాటు వేశాడు.దొంగలకు ఎటువంటి అనుమానం రాకుండా తాను ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని కూడలి వద్ద బైక్ తో రెడీగా వేచి ఉన్నాడు.

ఇదే నేపథ్యంలో మొబైల్ దొంగతనం చేసే దొంగలు ఓ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కుని పారిపోవడానికి అతడు చూశాడు.ఇక అంతే సింగం సినిమాలో సూర్య ఎలా దొంగలను పట్టుకోవడానికి తనదైన స్టైల్లో పోరాటం చేస్తాడో అచ్చం అలాగే ఆ మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులు పట్టుకోవడానికి ఎస్ఐ బైక్ పై చేదించి మరి వారిని పట్టుకున్నాడు.

ఇలా దొంగలు పట్టుకున్న సమయంలో ఆ దొంగలు బైకులు ఆపకుండా నడిపేందుకు ప్రయత్నించిన కానీ.ఆ ఎస్సై పట్టువిడవకుండా వారిని వెంబడించి చివరికి అదుపులోకి తీసుకున్నాడు.ఆ దొంగను విచారించగా మొత్తం ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు దొంగలను వారు అదుపులోకి తీసుకున్నారు.ఇలా వారి దగ్గర నుంచి మొత్తం 11 దొంగిలించిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఎస్సై దొంగలను పట్టుకున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.దీంతో అనేకమంది నెటిజన్స్ ఆ ఎస్ఐ ను రియల్ సింగం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

#Hunters #Real Police #Chennai Police #Police Officers #Theifs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు