వైరల్ వీడియో: టీ హోటల్ లోకి దూరిన కోతి.. చివరకు..?!

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల ఏమి జరుగుతున్నాగాని క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది.ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు, ప్రకృతి అందాలు ఇలా ఒక్కటి ఏంటి ప్రతి ఒక్కటి సోషల్ మీడియా ద్వారా అందరికి తెలుస్తుంది.

 Viral Video :the Monkey Who Got Into The Tea Hotel Finally , Viral Video, Viral-TeluguStop.com

ఈ మధ్య ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.అవి చేస్తున్న పనులు, అల్లరి చేష్టలు, ఫన్నీ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇప్పుడు ఒక కోతి చేసిన పని నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.ప్రస్తుతం ఈ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు కోతిని అభినందించకుండా ఉండలేరు.ఏంటి అల్లరి చిల్లరి వేషాలు వేసే కోతిని అందరు పొగడడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.? కానీ., నిజంగానే ఈ కోతి చేసిన పని గురించి తెలిస్తే మాత్రం నిజంగానే మీరు కూడా కోతికి చప్పట్లు కొడతారు.

ఈ వీడియోలో కనిపించే కోతి అల్లరి చేసే కోతి కాదు అన్నింటి కంటే ప్రత్యేకమైంది అనే చెప్పాలి.ఇంతకీ అసలు కోతి చేసిన పని ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

మనం రోడ్ సైడ్ వెళ్తుంటే ఎన్నో టీ షాప్స్ కనిపిస్తాయి కదా.అయితే అక్కడ హోటల్స్ లో ఎవరో ఒకరు అంట్లు కడగడం మీరు గమనించే ఉంటారు.కానీ ఈ వీడియోలో మాత్రం ఒక టీ షాప్ లో ఉన్న అంట్లు ఒక కోతి కడగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అవును మీరు విన్నది నిజమే టీ షాప్ లో ఉన్న అంట్లు అన్నీ ఒక కోతి చక్కగా తోమేసింది.

ఆ కోతిని చూసిన అందరూ కూడా కోతి చేసే పనులకు ఆశ్చర్యపోయారు.ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ కోతిని ఎంతగానో లైక్‌ చేస్తు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది సేపటికే లక్షల మంది ఈ వీడియోను చూశారు.అలాగే ఎవరికి నచ్చినట్లు వారు ఫన్నీగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.కోతులు అల్లరి పనులే కాకుండా ఇలాంటి మంచి పనులు కూడా చేస్తాయా అంటూ ఆ కోతిని నెటిజన్లు అభినందిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube