వైరల్ వీడియో: అన్ని తానై ఒక్కడే బావిని తవ్వి చేసిన వ్యక్తి..! ఎలాగో మీరే చూడండి..!

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక నానుడి ఉంది గుర్తు ఉందా.? అదే రీతిలో తన మీద తనకి ఉన్న నమ్మకంతో ఒక వ్యక్తి ఎవరు ఊహించని పని చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.శ్రమని నమ్ముకునే వారు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు అని ఈ వ్యక్తి నిరూపించాడు.కేరళలో ఓ వ్యక్తి ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఒక బావిని తవ్వేశాడు.

 Viral Video The Man Who Dug The Well All By Himself See For Yourself How-TeluguStop.com

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు కూడా అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

కొందరు అయితే అతన్ని వన్ మ్యాన్ ఆర్మీఅని కూడా పిలుస్తున్నారు.

 Viral Video The Man Who Dug The Well All By Himself See For Yourself How-వైరల్ వీడియో: అన్ని తానై ఒక్కడే బావిని తవ్వి చేసిన వ్యక్తి.. ఎలాగో మీరే చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోను ఒక క్యాప్షన్‌ తో పోస్ట్ చేయడం జరిగింది.

ఒక యువకుడు ఒంటరిగా బావిని తవ్వుతాడు ఇందులో మట్టిని ఎత్తడం, ఒక వైపు పడవేయడం అద్భుతమైన ప్రక్రియ అని క్యాప్షన్ పోస్ట్ చేశారు.సగం తవ్విన బావి లోపల నిలబడి మరింత లోతు త్రవ్వటానికి ఒక స్పేడ్ ఉపయోగించడంతో పాటు ఒక పొడవైన తాడు, బకెట్ ఉపయోగించాడు.

ఈ వీడియో మొదట అతను తవ్విన అదనపు మట్టిని బయట పడేయడంతో ప్రారంభమవుతుంది.ఇప్పటికి ఈ వీడియోను అనేకమంది వీక్షించారు.అలాగే ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్స్‌ కూడా వచ్చాయి.

చాలామంది ఈ వీడియో చూసి ఇతన్నిఅమేజింగ్ ఇంజనీరింగ్ అని కామెంట్స్ కూడా ఇచ్చారు.అలాగే ఈ వీడియో చూసి కొందరు అయితే చాలా బాగుంది అని అంటున్నారు.మరికొందరు అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు.

ఈ వ్యక్తిని నేటి తరం యువతీ యువకులందరికీ ప్రేరణగా తీసుకోవాలని, ఆత్మీనిర్భర్ భారత్ అంటూ కామెంట్స్ చేశారు.అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహించిన స్వావలంబన అని కొంతమంది పొగిడారు.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు అతన్ని పొగుడుతున్నారు.మనిషి తలుచుకుంటే కొండలను కూడా పిండి చేయగలడు అనడానికి ఇతను ఒక ఉదాహరణ.

ఏది ఎలా ఉన్న ఒంటరిగా బావి తవ్వడం అనేది మాములు విషయం కాదు.కష్టాన్ని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడు కూడా విఫలం అవ్వరు.

#Kerala #One Man #Viral Video #Netizens #Army

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు