వైరల్ వీడియో: ప్రపంచంలోనే అతి తక్కువ బరువు కలిగిన కోతులు..!

భూమి మీద ఎన్నో రకాల జీవచరలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి.అందులో కొన్ని రకాల జంతువులు చూడడానికి చాలా వింతగా ఎప్పుడు చూడని విధంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

 Viral Video, The Lightest Monkeys,  World ,smallest Monkeys,  Born, Twins, Viral-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే.మామూలుగా మనం చూసే కోతులు సుమారుగా ఎంత చిన్న కోతి అయినా సరే దాదాపు ఒక కేజి బరువుపైనే ఉండటం గమనిస్తూనే ఉంటాం.

అయితే తాజాగా ఇంగ్లాండ్ దేశంలోని చెస్టర్ జంతు ప్రదర్శన శాలలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.ప్రపంచంలోనే అతి తక్కువ బరువు కలిగిన రెండు కోతులు ఇటీవలే జన్మించాయి.

ఈ రెండు బరువు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.ఒక్కొక్క కోతి బరువు కేవలం పది గ్రాములు మాత్రమే ఉంది.ఈ రకమైన కోతులు ఈస్ట్రర్న్​ పిగ్మీ మార్మోసెట్ జాతికి చెందినవిగా జూ అధికారులు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ రెండు కవల కోతులు ప్రపంచంలోనే అతి తక్కువ బరువు ఉన్న కోతుల్లో రికార్డు సృష్టించాయి.

ఇలాంటి జాతి కోతులు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయని వారు తెలుపుతున్నారు.జో, బాల్​ డ్రిక్ అనే కోతుల జంటకు ఈ కవలలు జన్మించినట్లు జూ అధికారులు తెలిపారు.

ఈ జూలో కి కొత్త సభ్యులు రావడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఆ కోతులు జన్మించిన సమయంలో వాటిని చూసి తాము ఆశ్చర్యపోయానని అవి కేవలం పింగ్ పాంగ్ బాల్స్ కన్నా ఏమాత్రం బరువు లేవని వారు చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈ జాతి సంబంధించిన కోతులలో కోతి పిల్లలను పెంచడంలో తల్లి కోతి కన్నా తండ్రి కోతి ప్రధాన పాత్ర వహిస్తుందని అధికారులు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ అతితేలికైన కోతుల ఫోటోలు, వీడియోలు నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అవి కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి.

అయితే ఈ కోతులు చూడడానికి చాలా చిన్నవిగా, బరువు తక్కువగా ఉన్న కానీ చాలా గట్టిగా ఇది ఆరవగలవని జంతువుల డాక్టర్ తెలిపారు.ఈ రకం చెందిన కోతులు 8 ఇంచుల వరకు పెరుగుతాయని వారు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube