వైరల్ వీడియో: వధువు పాదాలకు నమస్కారం చేసిన పెళ్లికొడుకు..!

పెళ్లంటే నూరేళ్ల పంట.చాలా మంది తమ పెళ్లి వేడుకను ఎంతో వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు.రెండు మనసులను, కుటుంబాలను ముడివేసే అపురూప ఘట్టం పెళ్లి.మరి ఇటువంటి పెళ్లి వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.తాజాగా అలాంటి వీడియోనే ఒకటి తెగ వైరల్ అవుతోంది.పెళ్లికి సంబంధించిన వీడియోలు అనేవి నేటి రోజులల్లో నెట్టింట ఎక్కువగా జనాధరణను పొందుతున్నాయి.

 Viral Video: The Groom Who Greeted The Bride's Feet Viral Latest, Viral Video, V-TeluguStop.com

ఆ వీడియోలు చూసినట్లైతే కొన్ని చాలా నవ్వును తెప్పిస్తుంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే పెళ్లిలో పెళ్లికొడుకు చేసేటటువంటి ప్రవర్తన అందర్నీ నవ్వును కలిగించింది.ఆ వీడియో జనాల మనసులను తెగ ఆకట్టుకుంది.

నిరంజన్ మోహపాత్రా అనే ఆయన ఈ పెళ్లి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఆచారాలలో సంప్రదాయాలను బట్టి మనం చూసినట్లైతే ఆ వీడియో దక్షిణ ఇండియాకు చెందినదిగా తెలుస్తోంది.

వివాహ ఆచారాలు అనేవి పూర్తి స్థాయిలో జరగడం అనేది మనకు వీడియోలో బాగా తెలుస్తుంది.అతిథులందరి మధ్య, వధువు, వరుడు ఒకరికి మరొకరు పూల దండలను మార్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పెళ్లి కూతురు మొదట పెళ్లి కొడుకు మెడలో పూల మాల వేస్తుంది.ఆ తర్వాత పెళ్లికొడుకు పాదాలకు నమస్కారం చేస్తుంది.ఆ తర్వాత పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతరి మెడలో పూల మాల వేస్తాడు.ఆ తర్వాత అతడు ఎవ్వరూ ఊహించని విధంగానే పెళ్లి కూతురి పాదాలకు నమస్కరించాడు.ఇది చూసినటువంటి అతిథులందరూ నవ్వుతారు.పెళ్లి ఆచారాలనేవి కొత్త మలుపు ఇవ్వడంతో వరుడు అక్కడున్నవారితో పాటు నెటిజన్ల మనసులను కూడా ఆ వరుడు దోచుకున్నాడు.పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ షాక్ అయినా ఆ తర్వాత నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube