వైరల్ వీడియో: ఆ పని చేయాలి అని డెలివరీ బాయ్ కి ఆర్డర్ ఇచ్చిన అమ్మాయి..!

వాలంటైన్స్ డే కోసం ప్రతిఒక్క ప్రేమ జంట ఎదురుచూస్తూ ఉంటారు.తమ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో అని ప్రతి ఒక్కరు ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

 Viral Video The Girl Who Ordered The Delivery Boy To Do That Work, Delivery Boy,-TeluguStop.com

ఫిబ్రవరి నెల అంటేనే ప్రేమికులకు సందడి.ఆ రోజు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.

గిఫ్ట్స్ అని, సర్ప్రైజెస్ అని తెగ హడావిడి చేసేస్తూ ఉంటారు.ఇంకా ప్రేమికుల రోజుకు ఒక్కరోజే సమయం ఉంది.

ఈ రోజు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురుచూసే వాళ్ళు కూడా ఎక్కువే.అయితే ఈ ప్రేమికుల రోజు మాత్రం రీసెంట్​ గా లవ్ బ్రేకప్ అయిన వారికి మాత్రం కొంచెం బాధాకరమైన విషయంగానే చెప్పవచ్చు.

వాళ్ళ పాట్నర్ ని తలుచుకుని బాధపడుతూ ఉండే వాళ్ళు కొంతమంది అయితే, మాజీ లవర్​ పై ఎలాగోలా కోపాన్ని తీర్చుకోవాలని ఎదురుచూసే వాళ్ళు కొంతమంది ఉంటారు.

ఇదే క్రమంలో చైనాకు చెందిన ఓ అమ్మాయి ఒక విచిత్రమైన ఆలోచన చేసి తన లవర్ పై ఉన్న కోపాన్ని తీర్చుకుంది.

తాను చేసిన ప్లాన్ లో భాగంగా ఒక డెలివరీ బాయ్​ సహాయాన్ని కోరింది.దాన్ని ఆ డెలివరీ బాయ్ కూడా అమలు చేశాడు.

వివరాలలోకి వెళితే.షాంగ్​ డాంగ్ కు చెందిన ఒక అమ్మాయి ఆన్​ లైన్లో టీ ఆర్డర్ ఇచ్చింది.అయితే అది తన కోసం కాదు.తన లవర్ కోసం.తాను ఆర్డర్ ఇచ్చిన టీ ను తన లవర్ కి డెలివరీ చేయాలనీ డెలివరి బాయ్​ కు ఓ ప్రత్యేక రిక్వెస్ట్ చేసింది.ఆ కప్ టీని తన బాయ్​ఫ్రెండ్​కు ఇవ్వాలని కానీ తన చేతికి కప్పు ఇవ్వొద్దని, ఆ వేడి వేడి టీ ని అతడిపై చల్లాలని సూచనలు చేసింది.

అయితే, ఆ డెలివరీ బాయ్ ఆమె చెప్పిన విధంగానే అదే పని చేశాడు.కస్టమర్ మాటను పాటించాలనుకొని.టీ తీసుకెళ్లి అతడిపై పోశాడు.డెలివరీ బాయ్​ తనపై టీ పోయగానే ఆ మాజీ లవర్ షాకయ్యాడు.

వెంటనే ఆ బాయ్​.అతడికి తన మాజీ ప్రేయసి సూచనలు చేసిన రిసిప్ట్​ ను ఇచ్చాడు.

తరువాత ఆ డెలివరీ బాయ్ అతనికి సారీ చెప్పి అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయాడు.మీటువాన్ అనే టేక్​ అవే సర్వీస్​ డెలివరీ బాయ్ ఈ పని పూర్తిచేశాడు.

అయితే దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్​ గా మారింది.ఈ వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube