ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎన్నో సోషల్ మీడియాల వేదికగా ఎన్నో వార్తలు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన అందరికీ నిమిషాలలో ఇట్టే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే అనేక రకాలైన వీడియోలు తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి.
ఈ వైరల్ వీడియోలలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు కనబడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
మనం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాం.
అంతేకాదు, ఎన్నో వీడియో లో కూడా చూసే ఉంటాం.ఎప్పుడైనా సరే పాములు కప్పలను చంపి తినడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం.
అంతేకాదు అదే ప్రకృతి ధర్మం కూడా.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పరిస్థితి మారింది.
అదేంటంటే.ఓ ఆకుపచ్చ కప్ప ఎంతో ధైర్యంగా పాముతో పోరాడడమే కాకుండా ఆ పాముని తనకి ఆహారంగా మార్చుకుంది.
ఆ రెండిటి మధ్య పోరాటం జరిగిన తర్వాత ఆ పాము బతికుండగానే కప్పు తన పామును నోట్లో పెట్టుకుని మింగేయడానికి ప్రయత్నించింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఈ విధమైన కప్పలను గ్రీన్ ట్రీ ఫ్రాగ్స్ గా పిలుస్తారు.ఇది మామూలుగా చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తూ ఉంటాయి.అప్పుడప్పుడు వీలైతే గబ్బిలాలు, ఎలుక లాంటి చిన్న చిన్న జీవులను తింటూ వాటి జీవనాన్ని కొనసాగిస్తాయి.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.