వైరల్ వీడియో: పాట పాడుతున్న గాయినికి అంటుకున్న నిప్పు.. చివరకు..?!

ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగే క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కళాకారులు తమ టాలెంట్ ని ప్రదర్శించడానికి రెడీ అయిపోతారు.క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ కోలాహలంగా గడుపుతారు.

 Viral Video The Fire That Burns The Wound Where The Song Is Used Finally, Viral-TeluguStop.com

అయితే స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఒక బ్రిటిష్ గాయని క్రిస్మస్ పండుగ సందర్భంగా పాడాల్సిన ఓ పాటను ప్రాక్టీస్ చేసింది.అయితే ప్రాక్టీస్ చేసే సమయంలో ఆమె జుట్టుకు దురదృష్టవశాత్తు నిప్పు అంటుకుంది.

పండుగ రోజు ఈ సంఘటన జరగడంతో ఆమె తన విషాదాన్ని వ్యక్తం చేసింది.ఈ దురదృష్టమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక గా తెగ చక్కర్లు కొడుతోంది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.సోఫియా అనే 27 ఏళ్ల బ్రిటిష్ గాయని.తన ప్రియుడు అల్వరొ సొలెర్ తో కలిసి క్రిస్టమస్ పాట ప్రాక్టీస్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.అల్వరొ గిటార్ వాయిస్తూ ఉంటే సోనియా సంతోషంగా పాట పాడుతోంది.

ఈ సమయంలోనే క్రిస్టమస్ ట్రీ పక్కనే వెలిగించిన కొవ్వొత్తి ఆమె జుట్టుకు అంటుకుంది.జుట్టు కాలిన తర్వాత ఆమెకు మంటగా అనిపించే వెనక్కి చూసుకోగానే తన జుట్టు ని పట్టుకోవడం చూసింది.

వెంటనే తనకు నిప్పు అంటుకుందని తన ప్రియుడికి ఆమె చెప్పగా ఆయన ఒక్క సారిగా షాక్ అయ్యి ఆమె జట్టుకు అంటుకున్న నిప్పును చేతితో ఆర్పి వేశాడు.జట్టుకి నిప్పు అంటుకుంది అన్న షాకులో ఆమె అక్కడినుంచి పరిగెత్తింది.

అయితే తన ప్రియుడు నిప్పును ఆర్పి వేయడం వల్ల ఆమె పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకో గలిగింది.2020 వ సంవత్సరంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.ప్రజలు మర్చిపోలేని వరస్ట్ ఇయర్ గా 2020 సంవత్సరాన్ని పరిగణించవచ్చు.ఈ ఏడాది చివరి వరకు ఇలాంటి సంఘటనలే జరుగుతాయని.చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని నెటిజన్లు సూచిస్తున్నారు.ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ అయిన వారం రోజుల్లోనే కోటి మంది వీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube