వైరల్ వీడియో: చిరుతపులి, బ్లాక్ పాంథర్ ల మధ్య పోరాటం.. గెలుపెవరిది..?

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వారి సమయాన్ని మొత్తం సోషల్ మీడియాలో గడిపేస్తూ ఉన్నారు.

 Viral Video The Fight Between The Leopard And The Black Panther The Winner, Blac-TeluguStop.com

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో మనం ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూస్తూనే ఉంటాం.ఇందులో ఎక్కువగా జంతువులు, వన్యప్రాణులు, పక్షులకు సంబంధిచినవి ఉంటాయి.

వీటిని చూసిన నెటిజన్స్ కొంత మంది సోషల్ మీడియాలో వారి ఫాలోయింగ్ ఎక్కువగా పెంచుకునేందుకు వాటిని షేర్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

సాధారణంగా చిరుతపులి, బ్లాక్ పాంథర్ అంటే అందరికీ వీక్షించడానికి ఆనందంగా ఉంటుంది.

బ్లాక్ పాంథర్ లు, చిరుతపులులు జన నివాసంలోకి వస్తున్న వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.ఐతే చిరుతపులి, బ్లాక్ పాంథర్ ఒకే సారి కలిసి ఉన్న వీడియోలో కానీ, ఫోటోలు కానీ మనం ఇంతవరకు చూడలేదు.

కానీ తాజగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ప్రముఖ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని తన సోషల్ మీడియా ద్వారా చిరుతపులి, బ్లాక్ పాంథర్ యుద్ధం చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వీడియో ఆధారంగా ఒక చెట్టుపై మొదట చిరుతపులి సేద తీరుతూ ఉంటే.

అప్పుడే అక్కడకు ఒక బ్లాక్ పాంథర్ కూడా వచ్చింది.చిరుత పులి ఉన్న చెట్టునే అది కూడా ఎక్కాలి అని అనుకుందో ఏమో కానీ చెట్టు ఎక్కుతుండగా చిరుతపులి దానిని గమనించి నికి వేరే చెట్టు లేదా.

అన్నట్లుగా గుర్రుమంది.బ్లాక్ పాంథర్ చిరుత పులితో గొడవ పెట్టుకునేందుకు సిద్ధపడి ఎక్కింది.

గంభీరంగా చూసినా చిరుత నాకెందుకు దీనితో గొడవ అని బ్లాక్ పాంథర్ మెల్లగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ లైకులు చేస్తుండడం తో పాటు, నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు.

ఇలా రెండు పులులను ఒకే సారి ఇలా చూడడం చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉందని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube