వైర‌ల్ వీడియో.. లైవ్ మ్యాచ్‌లోకి వ‌చ్చి బంతిని ఎత్తుకెళ్లిన కుక్క‌..

ఈ మ‌ధ్య లైవ్ మ్యాచ్‌లోకి మ‌నుషులు రావ‌డం చాలా ప‌రిపాటిగా మారిపోయింది.ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి ఇబ్బంది పెట్ట‌డం అల‌వాటుగా మారిపోయింది.

 Viral Video .. The Dog Who Came Into The Live Match And Picked Up The Ball .., V-TeluguStop.com

ఈ మ‌ధ్య అయితే భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇంగ్లాండ్ దేశంలో జరిగిన టెస్ట్ మ్యాచు మ‌ధ‌లోకి వ‌చ్చిన ఓ వ్యక్తి ఎంత పెద్ద రచ్చ సృష్టించాడో అంద‌రికీ తెలిసిందే.కాగా అత‌ని ఎంట్రీ ప్రతి ఒక్కరికీ ఫన్నీగా అనిపించినా కూడా అది మ్యాచ్ నిర్వాహ‌కుల‌ను చాలా ఇబ్బంది పెట్టింది.

అయితే అత‌ను ఒక‌సారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు ఇలాగే రావ‌డంతో అతడిపై చర్యలు కూడా తీసుకున్నారు స్టేడియం నిర్వాహ‌కులు.

కాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఇప్పుడు ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది.

అయితే మైదానంలోకి త‌ర‌చూ కుక్క‌లు రావ‌డాన్ని మనం చూస్తేనే ఉన్ఆనం.ఇలా అవి స్టేడియంలోకి వ‌చ్చి ప్లేయర్లందరిని పరుగులు పెట్టించడం చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి వీడియోలు మ‌నం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావ‌డం కూడాచూస్తున్నాం.అయితే ఇప్పుడు ఐర్లాండ్ లో మహిళల దేశీయ టీ20 టోర్నమెంట్ జ‌రుగుతోంది.

ఈ సిరీస్‌కు ఆల్ ఐర్లాండ్ టి 20 కప్అని కూడా పెట్టి పెద్ద ఎత్తున మ్యాచులు జ‌రుపుతున్నారు.ఇక దీంట్లో భాగంగా సెమీ-ఫైనల్ 11 సెప్టెంబర్ న జరిగింద‌ని తెలుస్తోంది.

ఇక ఈ మ్యాచులో బైర్డీ క్రికెట్ క్లబ్ వర్సెస్‌ సివిల్ సర్వీస్ నార్త్ జట్లు హోరోహోరీగా పోటీ ప‌డుతున్నాయి.అయితే ఇలా అత్యంత సీరియ‌స్‌గా జ‌రుగుతున్న మ్యాచ్ మ‌ధ్య‌లో ఒక ఫన్నీ సంఘటన జరిగింది.అదేంటంటే ఒక చిన్న కుక్క మైదానంలోకి వ‌చ్చి బాల్‌ను నోటిలో క‌రుచుకుంది.ఇక ఎవ‌రికి దొర‌క‌కుండా ఏకంగా రేసును అందుకుంది.ఇంకేముంది గ్రౌండ్‌లోని ఫీల్డర్లు అంద‌రూ కూడా బాల్ కోసం కుక్క వెంట పరుగులు తీశారు.ఇక చాలాసేపు కుక్క వారికి దొర‌క‌కుండా ప‌రుగులు పెట్టి చివ‌ర‌కు బంతిని విడిచి పెట్టి బ‌య‌ట‌కు వ‌స్తుంది.

ఈ సంఘటన ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube