వైరల్ వీడియో: పులికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శునకం..!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలను అయితే నెటిజన్లు బాగా ఇష్ట పడుతున్నారు.

 Viral Video: The Dog That Gave The Tiger A Crushing Counter, Tiger, Dogs, Viral-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా రెండు జంతువులకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే పులితో వేట అంటే ఆటలు కాదు.

దాని కంట ఒకసారి పడ్డామా ఇంక అంతే సంగతులు.అది జంతువు అయినా సరే,లేదంటే మనిషి అయినా సరే వేటాడ కుండా అసలు వదిలిపెట్టదు.

కానీ ఒక కుక్క మాత్రం పులికి పట్ట పగలే చుక్కలు చూపించింది అనుకోండి.కుక్క దెబ్బకు పులి కాస్త బేంబేలెత్తితి పోయి ఈరోజు నా టైమ్ బాలేదు అనుకుని అక్కడ నుండి వెళ్లిపోయింది.

ఈ వీడియో ప్రకారం ఇంట్లో బంధించి కొడితే పిల్లి కూడా పులి అవుతుందనే సామెత ఇప్పుడు ఈ ఘటనకు చక్కగా సరిపోతుంది.ప్రాణం మీదకు వచ్చినప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటువంటి జంతువైనా ప్రాణాలకు తెగించి మరి పోరాడుతుంది.

ఒక అడవిలోని మట్టి రోడ్డుపై కుక్క పడుకుని ఉండడాన్ని ఒక పులి గమనిస్తుంది.అదును చూసి దాడి చేద్దాం అని పక్కన ఉన్న పొదల్లోంచి నక్కి నక్కి చూస్తూ దాని ముందుకు వచ్చి గాండ్రించింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కుక్కలేచి నిలబడి అక్కడ నుండి పారిపోకుండా పులిపై గట్టిగా మొరగడం మొదలుపెట్టింది.కుక్క తనపై తిరుగుబడడంతో ఒక్కసారిగా పులి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది.

చివరకు ఈ కుక్కతో నాకెందుకులే అనుకుందో ఏమో తోక ముడుచుకుని వెళ్ళిపోతుంది.ఈ ఘటన మొత్తాన్ని పక్కనే వాహనాల్లో ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube