వైరల్ వీడియో: స్విమ్మింగ్‌ పూల్ ‌లో పడిన కుక్క.. చివరికి..!?

అనుకుంటే కానిది ఏమున్నది చెప్పండి ఆ పని మన వాళ్ళ కాదు అని అనుకుంటే మనం జీవితంలో ఏ పని చేయలేము అనడానికి ఉదాహరణ ఒక కుక్కఏంటి కుక్కని చూసి నేర్చుకోమంటున్నారు అనుకుంటున్నారా ? కానీ ఏ కుక్క చేసిన పని తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు.ప్రస్తుతం ఓ కుక్కకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

 Viral Video The Dog That Fell In The Swimming Pool Finally Dog, Viral News, Vir-TeluguStop.com

ఇంతకీ ఆ కుక్క ఏమి చేసిందో ఒకసారి తెలుసుకుందాం.

ఈ సంఘటన జరిగింది సౌత్ ఆఫ్రికాలోనిజొహాన్నెస్‌బర్గ్ ‌లో.అక్కడ బైరన్, మెలిస్సా అనే దంపతులకి వాళ్ళ ఇంట్లో ఒక విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ ఉంది.అలాగే ఆ దంపతులు ఒక రెండు కుక్కలను ఎప్పటినుంచో పెంచుకుంటున్నారు.

ఇక కుక్కల విషయానికి వస్తే ఒక కుక్క పేరు జెస్సీ.మరొక కుక్కలు పేరు చక్కీ.

తన ఫ్రెండైన 15 ఏళ్ల పొమెరానియన్ జాతి కుక్క చక్కీ అనుకోకుండా అక్కడ ఉన్న స్విమ్మింగ్ ‌పూల్ ‌లో పడింది.చిక్కీకి ఈత రాదు.

అది పూల్‌ లో పడి ఎలా పైకి రావాలో అర్థం కాక గిలగిలా కొట్టుకుంటూ, ఈదుతూ మూలుగుతూ ఉంది.అది చూసిన జెస్సీ దాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకుంది.

చక్కీ చాలాసార్లు పూల్ ఒడ్డుకు వస్తున్న పైకి ఎక్కలేకపోతోంది.తన ఫ్రెండ్ ని ఎలా కాపాడుకోవాలో తెలియక జెస్సీ పడిన బాధ అంతా ఇంతా కాదు.

ఇక్కడో ట్విస్ట్ ఉంది.జెస్సీకి వాటర్ అంటే భయం.నీరు ఉన్న చోటికి అస్సలు వెళ్లదు.కానీ ఇప్పుడు తన ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉండేసరికి తన భయాన్ని పక్కన పెట్టి పోరాడింది.

ఇలా అరగంటపాటూ ప్రయత్నించాక చివరకు చక్కీని తన నోటితో పట్టుకొని బయటకు లాగేసింది జెస్సీ ఆ తర్వాత అవి ఆడుకోవడానికి వెళ్లిపోయాయి.

ఈ పూల్ ‌కి దగ్గర్లోనే ఓ సీసీ టీవీ కెమెరా ఉంది.

అది ఈ మొత్తం స్టోరీని షూట్ చేసింది.ఇంత జరిగినా ఇంట్లో ఉన్న దంపతులకు ఈ విషయం తెలియలేదు.చక్కీ తల తడిసినట్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు వారికి అసలు విషయం తెలిసింది.జెస్సీని మెచ్చుకున్న ఆ దంపతులు ఇకపై ఆ మూగ జీవాలకు కష్టం కలగకుండా అవి స్విమ్మింగ్ పూల్‌ లో పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.కావాలంటే స్విమ్మింగ్‌పూల్ మూసేస్తామని అన్నారు.

ప్రస్తుతం జెర్సీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube