వైరల్ వీడియో: పెళ్ళి స్టేజిపై పెళ్లికొడుకును ఆటాడేసుకున్న పెళ్ళికూతురు..!

పెళ్లి అంటే ఇద్దరి మనుషులకు సంబందించిన వేడుక కాదు.రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.

 Viral Video The Bride Who Played The Groom On The Wedding Stage-TeluguStop.com

పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే ఏకం అవ్వరు.రెండు కుటుంబాలు సైతం ఒక్కటి అవుతాయి.

అలాగే పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వచ్చే మధురమైన జ్ఞాపకం.మరి అలాంటి పెళ్లి వేడుకను ఎంత ఆర్బాటంగా చేయాలో ఒకసారి మీరే ఆలోచించండి.

 Viral Video The Bride Who Played The Groom On The Wedding Stage-వైరల్ వీడియో: పెళ్ళి స్టేజిపై పెళ్లికొడుకును ఆటాడేసుకున్న పెళ్ళికూతురు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు చేసే హడావుడి, సందడి అంతా ఇంతా కాదు.ఆ పెళ్ళిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని చాలా అట్టహాసంగా చేసుకుంటూ ఉంటారు.

అయితే ఈ మధ్య పెళ్లి వేడుకల్లో నూతన వధూవరులు చేసే అల్లరి చేష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పెళ్లిలో వధువరులు చేసే హంగామా వీడియోలను సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటాము.

అయితే ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది.ఒక పెళ్లి వేడుకలో నూతన వధు వరులు చేసిన చిలిపి చేష్టలు చూసే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాయి.

అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దామా.పెళ్లి అయ్యాక వధూవరులు స్టేజ్ మీదకి వచ్చారు.ఈ క్రమంలో నూతన దంపతులు ఇద్దరిని దండలు మార్చుకోమని పెద్దవాళ్ళు చెప్పారు.ఈ క్రమంలో వధువు బంధువులు కొందరు ఆమె దగ్గరకి వచ్చి చెవిలో ఏంటో గుసగుసలు ఆడి స్టేజ్ మీద నుంచి పక్కకు వెళ్లిపోయారు.

బహుశా పెళ్లి కొడుకుని ఆట పట్టించమని ఎమన్నా సలహా ఇచ్చారేమో వధువు ముఖంలో ఒకింత వచ్చి రాని నవ్వు తారస పడుతుంది.వరులు ఇద్దరు చెవిలో ఏంటో గుసగుసలు ఆడుకున్నారు.

తదనంతరం పూల దండలు మార్చుకునే ప్రయత్నం చేసారు.ముందుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెడలో పూలదండ వేస్తుంది.

తరువాత పెళ్లి కొడుకు వధువు మెడలో దండ వేయాలి.అయితే పెళ్లి కూతురు మెడలో దండ వేయడానికి పెళ్లి కొడుకు ముందుకు వచ్చాడు.కానీ., పెళ్లి కూతురు మాత్రం దూరం దూరం జరుగుతూ పెళ్లి కొడుక్కి అందకుండా ఆట పట్టిస్తుంది.మళ్ళీ పెళ్ళికొడుకు ఇంకాస్త ముందుకు రాగ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు అందకుండా అటు ఇటు స్టేజ్ అంతా తిరగసాగింది.వరుడు ఎంతగానో ప్రయత్నం చేసాడు.

కానీ.వధువు అతనికి చిక్కలేదు.

చేసేది లేక వరుడి బంధువులు కొంతమంది అతని తరుపు నిలబడి వధువు మెడలో పూలమాల వేయడంలో సహాయ పడ్డారు.వధువరుల చిలిపి చేష్టలు చూసి అక్కడ ఉన్నవారంతా బాగా నవ్వుకున్నారు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్త బాగా వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ తమ దైన శైలిలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

#Groom #Stage #Bridge #Marraige

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు