వైరల్ వీడియో: రెచ్చిపోయినా అశోక్ గజపతి రాజు.. మహిళా కార్యకర్త పై..?!

అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

 Viral Video Tdp Leader Ashok Gajapathi Raju Beaten Tdp Women Activist-TeluguStop.com

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారు.వారికీ రాజకీయంగా మద్దతుగా వచ్చిన వారిని కూడా లెక్కచేయకుండా కొట్టేస్తున్న సందర్భాలు ఏర్పడ్డాయి.

మహిళా దినోత్సవ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఒక టీడీపీ మహిళ కార్యకర్తపై చెయ్యి ఎత్తారు.ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాలలో హల్చల్ సృష్టిస్తోంది.

 Viral Video Tdp Leader Ashok Gajapathi Raju Beaten Tdp Women Activist-వైరల్ వీడియో: రెచ్చిపోయినా అశోక్ గజపతి రాజు.. మహిళా కార్యకర్త పై..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు పెరుగుతున్న క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు విజయనగరంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు.

ఇక గజపతిరాజు వెంట టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.ఇందులో మహిళలు కూడా ఉండడం విశేషం.అయితే, ఒక మహిళా కార్యకర్త తన అభిమాన నేత నగరానికి వచ్చాడని సంతోషంతో అశోక్ గజపతి రాజు పుష్పాలు జల్లింది.అయితే పక్కనే ఉన్న మరో మహిళా కార్యకర్త ఆమెను వారించడంతో సహనం కోల్పోయిన అశోక్ గజపతి రాజు సదరు మహిళా కార్యకర్త పై విరుచుపడ్డారు.

ఆ మహిళా కార్యకర్త చేతిలో ఉన్న పుష్పాలు అన్నిటిని కూడా కింద పడేసి మరి కొట్టడం మొదలు పెట్టాడు.ఈ సంఘటన మొత్తం చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మహిళల పై చేయి చేసుకోవడం ఏంటి.? అది కూడా సొంత పార్టీ కార్యకర్తలు కూడా లెక్క చేయకుండా ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇలా గజపతిరాజు ఆ మహిళా కార్యకర్తపై ఇలా చెయ్ చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఒక టీడీపీ కార్యకర్త పై చేయి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

#TDp Leader #Mahila Leader #Beaten #Women Leader #Slapped

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు