వైరల్ వీడియో: సిక్సర్లతో చెలరేగిన తలైవా ధోనీ..!

మహేంద్రసింగ్ ధోని ఫాంలో ఉంటే సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లను రఫాడిస్తారు.ఓడిపోతున్న మ్యాచ్ ను కూడా ఆయన తన టాలెంట్ తో గెలిపించగలరు.

 Viral Video: Taliva Dhoni Hits Sixes ..! Ipl2021, Csk,captain, Ms-dhoni, Dazzlin-TeluguStop.com

ధనాధన్ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ ప్రత్యర్థి జట్టులకు చెమటలు పట్టించగలరు.అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న ధోని ఈసారి ఐపీఎల్ లో తన విశ్వరూపం చూపించేందుకు నెట్స్​ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.

ఐపీఎల్​ 14వ సీజన్​ మలిదశ కోసం ఆయన చేస్తున్న ప్రాక్టీస్ ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంటోంది.గత సీజన్ లో నాసిరకమైన ఆటతో ఇండియన్ ప్రేక్షకులను నిరాశ పరిచిన ఆయన ఈసారి అదరగొట్టాలనే గట్టి సంకల్పంతో ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం యూఏఈలో ట్రైనింగ్ ప్రారంభించిన చెన్నై ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తోంది.అయితే ఈ నేపథ్యంలోనే తొలి రోజే సిక్సులతో ధోని రెచ్చిపోయారు.

ధోని స్టాండ్స్ లోకి కొట్టిన షాట్ల కు సంబంధించి ఓ వీడియో క్లిప్ ను చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్​ వేదికగా షేర్ చేసింది.ప్రాక్టీస్ మొదలైన తొలి రోజు నుంచే ఆయన మంచి ఫామ్ లో కనిపిస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ ఒకప్పటి ధోనిని చూస్తున్నామని ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ధోనీ తన ఫేవరెట్‌ షాట్ అయిన హెలికాప్టర్‌ షాట్‌తో రెచ్చిపోవడం చూడొచ్చు.ఈ సారి మంచి ఆట ప్రదర్శన చూపించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని వీడియో చూస్తే స్పష్టమవుతుంది.గట్టి పట్టుదలతో, కసితో ఆయన కొడుతున్న షాట్లు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

అయితే ఈ వీడియోని సీఎస్‌కే టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube