వైరల్ వీడియో :హాస్య నటుడి గొంతు కోసి మరి చెంపేసిన తాలిబన్లు.. !

తాలిబన్లు అనే పేరు వింటే చాలు ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతారు.ఎందుకంటే తాలిబన్లు శిక్ష పడిన హంతకులను, మోసం చేసినవారిని, వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళని అతి కిరాతకంగా చంపడం, బహిరంగంగా ఉరి తీయడం, దొంగతనం చేసిన వారికి కాళ్లు చేతులు విరిచి వేయడం లాంటి క్రూరమైన శిక్షలు విధించి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

 Viral Video Talibans Killed The Comedian In Afganisthan-TeluguStop.com

ఆ వీడియోలు చూస్తే గుండెల్లో దడ పుట్టాలిసిందే.అందుకే తాలిబన్లు అనే పేరు వింటే ప్రతి ఒక్కరికి గుండె దడదడ మని కొట్టుకుంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ప్రధాన భాగాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న తాలిబాన్లు అక్కడ ప్రజలను అతి క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నారు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.కొన్ని రోజులకు ముందు తాలిబాన్లు ఆ దేశంలోని ప్రముఖ హాస్యనటుడు అయిన నాజర్ మొహమ్మద్ అకా ఖాసా జవాన్ (ఖాషా జ్వాన్) ను అతి భయంకరంగా కందహార్ ప్రావిన్స్‌ లో చంపేశారు.

 Viral Video Talibans Killed The Comedian In Afganisthan-వైరల్ వీడియో :హాస్య నటుడి గొంతు కోసి మరి చెంపేసిన తాలిబన్లు.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందరి ముఖాల్లో చిరునవ్వును తెప్పించే అతన్ని ఇలా చంపేయడం భాద కరమైన విషయం అనే చెప్పాలి.అయితే ఆయన్ని హత్య చేసే ముందు ఆయన్ని కార్ లో ఎక్కించుకుని తీసుకుని వెళ్లే వీడియో రిలీజ్ చేసింది.

ఈ వీడియోలో హాస్యనటుడి ని కార్ లో ఎక్కించుకుని చెంప మీద కొట్టడంతో పాటు వాళ్ళ భాషలో తిట్టడం కూడా మనం గమనించవచ్చు.

అక్కడ బాధల్లో ఉన్న దేశ ప్రజల ముఖాల్లో చిరునవ్వుని తెచ్చిన మహ్మద్‌ ను తాలిబాన్లు ఇంటి నుంచి కిడ్నాప్ చేసి మరి చంపేశారు.అఫ్ఘనిస్తాన్ మీడియా కధనం ప్రకారం.నాజర్ మొహమ్మద్ ను కిడ్నాప్ చేసి అతన్ని చంపేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

కొన్ని వార్త సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.నాజర్ మొహమ్మద్ ఇంతకు ముందు కాందహార్ పోలీసులలో కలిసి పనిచేశాడని తెలుస్తోంది.

ఆ విషయం తెలిసి ఆయన్ని ఇంటి నుండి కిడ్నాప్ చేసి చెట్టుకు కట్టేసి కొట్టినట్లు మీడియా కథనాల్లో వార్తలు వచ్చాయి.ఆ తరువాత అతన్ని అతి కిరాతంగా గొంతు కోసి చంపేశారని తెలిసింది.

ఈ విషయం తెలిసి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

#Killed Brutally #Harmless #Kandahar #ViralVideo #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు