వైరల్ వీడియో: చుక్క బీరు కింద పడకుండా సూపర్ క్యాచ్..!

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైన క్యాచ్ లు, ఒక్కోసారి స్టేడియం దాటి బాల్స్ రోడ్డు పైకి వెళ్తున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉంటాం.తాజాగా ఆస్ట్రేలియాలో బిగ్​ బాష్ టీ20 (బీబీఎల్) లీగ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 Viral Video Super Catch Without Dropping A Drop Of Beer In Big Bash T20 League,-TeluguStop.com

ఈ లీగ్ లో భాగంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా స్టేడియంకు చేరుకొని తెగ  ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో భాగంగా హాజరైన ఒక వ్యక్తి అద్భుతమైన క్యాచ్ ను పట్టుకున్నాడు.

ఒక పక్కన ఒక చేతితో బీర్ గ్లాస్, మరో చేత అటువైపుగా సిక్సర్ గా వచ్చిన బంతిని చాలా సులువుగా ఒడిసి పట్టుకున్నాడు.ఎలాంటి తడబాటు లేకుండా ఆ బంతిని చాలా సులువుగా పట్టుకోవడం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ సంఘటన మొత్తం కెమెరా లో రికార్డ్ అవ్వగా.ఆ వీడియోలో కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

ఈ సందర్భంగా కామెంటేటర్లు మాట్లాడుతూ.ఒక్క బీరు చుక్క కూడా కింద పడకుండా కనీసం తడబడకుండా ఎంత స్టడీగా ఆ బాల్ ను పట్టుకున్నాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఈ వీడియోను బిగ్ ​బాష్ లీగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.“వావ్ ఒక ఓల్డ్ మెట్ ఎలాంటి హడావుడి లేకుండా అతను ఎంతో సునాయాసంగా సాధారణంగా ఆ బంతిని పట్టుకున్నాడు ” అనే క్యాప్షన్ ను జత చేసింది.ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ బంతిని పట్టుకున్న వ్యక్తి ఫేమస్ అయిపోయాడు.ఒక ప్రముఖ ఛానల్ ఆ వ్యక్తితో ఏకంగా ఇంటర్వ్యూనే  నిర్వహించింది.

ఈ వీడియోను చుసిన  నెటిజన్స్ వాట్ ఎ క్యాచ్ అని కామెంట్స్ పెడుతూ ఉంటే, మరికొందరయితే కష్టమైన క్యాచ్ ను కూడా ఎంతో సులువుగా పట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube