వైర‌ల్ వీడియో.. దిక్కులు చూస్తూ న‌డిచిన సింహానికి స‌డెన్ షాక్‌..

ఎవ్వ‌రైనా స‌రే దారి వెంట న‌డిచేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా న‌డ‌వాలి.లేదంటే మాత్రం ఎటో ఒక‌వైపు ప‌డిపోవ‌డ‌మో లేదంటే ప‌క్క‌న వ‌స్తున్న వారిని ఢీకొట్ట‌డ‌మో జ‌రుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే.

 Viral Video .. Sudden Shock To A Lion Looking In Directions .., Viral Video, Lio-TeluguStop.com

అయితే ఈ సూత్ంర కేవ‌లం మ‌నుషుల‌కు మాత్ర‌మే కాదండోయ్ ప్ర‌తి ఒక్క‌రికీ వ‌ర్తిస్తుంది.జంతువులు కూడా ముందుకు చూసి న‌డ‌వ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలిపే ఫ‌న్నీ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి సోష‌ల్ మీడియా అంటేనే ఇలాంటి ఫ‌న్నీ వీడియోల‌ను తీసుకువ‌చ్చే ఒక ప్లాట్ ఫామ్‌లా ఇప్పుడు ఉంది.

ఇక జంతువుల‌కు సంబంధించిన ఫ‌న్నీ వీడియోల‌ను నెట్టింట పాపుల‌ర్ చేయ‌డంలో నెటిజ‌న్లు ఎప్పుడూ ముందుంటారు.

కాగా ఈ వీడియోలో ఓ సింహం దిక్కులు చూస్తూ న‌డిస్తే ఏం జ‌రుగుతుందో తెలుపుతోంది.ఇక సింహానికి సంబంధించిన ఈ ఫ‌న్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చెక్క‌ర్లు కొడుతోందండోయ్‌.

ఇక సింహం కాబ‌ట్టి ఆ రేంజ్‌లోనే నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెట‌ట్ఏస్తున్నారు.అయితే ఈ వీడియో చూస్తే ఇది ఓ పార్క్‌లో రెండు సింహాలు స‌ర‌దాగా న‌డుచుకుంటూ వెళ్తున్న‌ట్టు క‌నిపిస్తుంది.

ఇక ఇలా ఆ రెండు నడుస్తూ ఉండ‌గా అందులో ఓ సింహం ముందు చూసుకోకుండా ఎక్కడో ఇక్కులు చూస్తూ సాగుతుంది.ఇక దాని ప‌క్క‌నే ఓ నీటి తొట్టి కూడా ఉంది.అయితే ఇది అలా నీటి తొట్టి అంచున న‌డుస్తూ పొర‌పాటున నీటి తొట్టిలో కాలు వేసి అందులో ప‌డిపోతుంది.ఇక దాని వెన‌కాలే వ‌స్తున్న మ‌రో సింహం దానిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నా కూడా వ‌ర్కౌట్ కాదు.

దీంతో ఆ సింహం నీటిలోనే ఈదుతూ ఒడ్డుకు చేరుకుంటుంది.ఇక ఇదంతా కూడా అక్క‌డే ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది.

దీంతో ఇది చూసిన వారంతా ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube