వైరల్ వీడియో: ఇన్నేళ్ళ తర్వాత కూడా ఏమాత్రం మారని శ్రీశాంత్..!

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టార్ క్రికెటర్ శ్రీకాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు.2013 ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకుగాను బీసీసీఐ శ్రీకాంత్, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది.అయితే బౌలర్ శ్రీకాంత్ పై విధించిన నిషేధాన్ని 7 ఏళ్ల కు కుదించింది.ఏడేళ్ల అనర్హతవే టు అనుభవించిన శ్రీకాంత్ సెప్టెంబరు నెలతో తన శిక్ష ను పూర్తి చేశారు.

 Sreesanth, Viral Vidoe, Social Media, Twitter, Match, Kerala Crciket Association-TeluguStop.com

ముంబై లో జనవరి 10 నుంచి జరిగే సయ్యద్‌ ముస్తాక్‌ టీ20 టోర్నమెంటు లో శ్రీకాంత్ ఆడనున్నాడు.కేరళ క్రికెట్ ప్రోబబుల్స్ జట్టు తరఫున శ్రీకాంత్ ఆడుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే టోర్నీ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడిన శ్రీకాంత్ గతం లో లాగానే తన కోపాన్ని బాగా చూపించాడు.

ఫాస్ట్ గా బౌలింగ్ వేసే ఇతను.ఎవరైనా తాను వేసిన బంతిని బౌండరీ కొడితే బ్యాట్స్‌మన్‌ పై స్లెడ్జింజ్‌ కు పాల్పడతాడు.8 ఏళ్ల తర్వాత కూడా తనలో అదే అగ్రెసివ్ నెస్ కనిపించింది.టోర్నీ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓ బ్యాట్స్‌మన్‌ శ్రీకాంత్ విసిరిన బంతిని భారీ షాట్ ఆడాడు.దీంతో పిచ్ పై నిలబడి శ్రీకాంత్ బాగా కోప్పడుతూ స్లెడ్జింజ్‌ కు దిగాడు.

దీనికి సంబంధించిన వీడియో ని కేరళ క్రికెట్ అసోసియేషన్ యూట్యూబ్ వేదికగా షేర్ చేసింది.అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయన తీరుపై మండిపడ్డారు.

ఒకసారి స్పాట్ ఫిక్సింగ్ లో దొరికి ఏడేళ్లు అనర్హత వేటుకు గురయ్యావు.అయినా నీ లోని కోపం ఇంతవరకు తగ్గలేదు.నువ్వు ఇక మారవా, శ్రీకాంత్? అని నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తున్నారు.కేరళ జట్టుకి సంజు శాంసన్ నాయకత్వం వహిస్తారని కేరళ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.

రాబిన్ ఉతప్ప, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు కేరళ జట్టు తరఫున ఆడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube