వైరల్: అనుమానిస్తూనే బాదం పప్పును ఆరగించేస్తోన్న బుల్లి ఉడుత!

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తరువాత అనేకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇక వైరల్ అయిన వీడియోలలో ఎక్కువగా జంతువుల వీడియోలు మనకు తారసపడుతూ ఉంటాయి.

 Viral Video Squirrel Suspiciously Eating Almonds Details, Squrill, Viral Latest,-TeluguStop.com

ఈ క్రమంలో కుక్కలు, పిల్లులు, పులులు, సింహాలకు చెందిన పలు రకాల వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.అయితే ఒక్కోసారి కొన్ని రకాల చిన్న జంతువులైన ఉడుత, తొండకి సంబంధించినవి కూడా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇవి విశేషంగా మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకోవడం కొసమెరుపు.ప్రస్తుతం మనం అలాంటి వీడియో గురించే ఇపుడు తెలుసుకోగలుగుతున్నాం.

ఇకపోతే, వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, అడవిలో వున్న ఓ బుల్లి ఉడుత జనావాసంలోకి వచ్చింది.దాంతో ఓ వ్యక్తి దానికి బాదం పప్పు తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

బేసిగ్గా చిన్న చడీచప్పుడు కాగానే ఉరకలెత్తే ఉడుత.దానికి విరుద్ధంగా మనిషి చేతిలోని బాదం పప్పును తినే ప్రయత్నం చేస్తోంది.

అయితే కాస్త అనుమానంగానే ఆ మనిషివైపు చూసిన ఉడుత ఆ వెంటనే చకచకా బాదం పప్పులను తినడం.నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అర చేతిలో బాదం పప్పులను పట్టుకుని ఉండటం మనం గమనించవచ్చు.

అయితే అంత ఈజీగా వారిని నమ్మలేదు ఆ బుల్లి ఉడుత.చాలా సేపు అనుమానంగా చూస్తుంది.కొంపతీసి.

నన్ను పట్టుకోవడానికి ప్లాన్ ఏమీ వేయలేదు కదా!.అన్నట్టు కొద్దిసేపు అనుమానంగా చూసి, తర్వాత తేరుకుని ఎలాగైతే.

అలా అవుతుంది.అని అన్నట్లుగా చకచకా కొన్ని బాదం పప్పులను నోట్లో పెట్టేసుకోవడం మనం గమనించవచ్చు.“చిప్‌మంక్ మొదటిసారి బాదంపప్పు రుచి చూస్తోంది!”.అని క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్టు చేశారు.

ఈ వీడియో 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకొని చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube