వైరల్ వీడియో: సరుకులు తీసుకునేందుకు ఫ్రిడ్జ్ డోర్ తీయగా బుసలు కొడుతూ ప్రత్యక్షమైన పాము..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది.వర్షాలు కురవడం వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.

 Viral Video Snake In The Fridge While Opened To Put The Things , Black Cobra, Hi-TeluguStop.com

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఎక్కడా కూడా చెరువులు, కుంటలో నిండిపోయాయి.

వానల వల్ల పాములు, పురుగులు ఇల్లల్లోకి వస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఆ జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ పాము వానకు ఉండలేక ఓ ఇంట్లోకి వచ్చి చేరింది.ఇంట్లోకి రావడమే కాదు ఏకంగా అది ఫ్రిజ్ లోకి వచ్చి చేరిపోయింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓ త్రాచుపాము ఇంట్లోకి చేరిపోయింది.ఇంట్లోకి రావడమే కాదు అది ఫ్రిజ్ లోకి దూరిపోయింది.

దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆ పామును చూసి పరుగులు తీశారు.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంకలో ఈ ఘటన చోటుచేసుకుంది.6 అడుగుల నల్ల త్రాచుపాము ఇంట్లోకి రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు.పితాని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఆ పాము దూరింది.

ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిజ్ లో ఆ పాము చేరిపోయింది.ఇంట్లో వాళ్లు ఫ్రిజ్‌లో ఉన్నటువంటి వాటిని తీసుకునేందుకు ఆ ఫ్రిన్ ను ఓపెన్ చేశారు.

దీంతో ఒక్కసారిగా ఆ పాము బుసలు కొడుతూ ఫ్రిజ్ నుంచి బయటకు వచ్చింది.

ఆ పాము ఒక్కసారిగా పడగవిప్పి బుసలు కొట్టడంతో అందరూ భయంతో కంపించిపోయారు.పాము చేసే శబ్దానికి ఒక్కసారిగా ఆ కుటుంబీకులు హడలిపోయారు.ఫ్రిజ్‌లో దాకున్న ఆ పాము చేసే అరుపులు విని భయంతో వనికిపోయారు.

వెంటనే ఆలస్యం చేయకుండా వారు పాములను పట్టేవారికి సమాచారాన్ని అందించారు.దీంతో పాము ఉన్న స్థలానికి ఆ పాములు పట్టేవారు చేరుకున్నారు.

వెంటనే ఆ పామును పట్టేందుకు ఓ గంటపాటు శ్రమించారు.అలా ఎంతో శ్రమించిన తర్వాత పామును పట్టుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి ఆ పామును వదిలిపెట్టారు.

దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube