వావ్‌.. కుక్క‌ను కాపాడేందుకు పిల్లి చేసిన ప్ర‌య‌త్నానికి ఫిదా కావాల్సిందే..

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.అందులో ముఖ్యంగా వాటి కొట్లాట వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్‌ అవుతుంటాయి.

 Viral Video Shock To See The Work Done By The Cat For The Dog-TeluguStop.com

ప్ర‌స్తుతం అలాంటి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.ఇందులో కుక్కను కాపాడేందుకు పిల్లి ఇంకొక‌ పిల్లితో పోరాటం చూస్తే మనం ఆశ్చర్యపోతాం.

కుక్కను కాపాడేందుకు పిల్లి చేసిన ఫైటింగ్ నెట్ ప్రియుల‌ను బాగా ఆకట్టుకొంటుంది.జాతి వైరం మరిచిపోయి తన జాతి జంతువుతోనే ఫైటింగ్‌కు కాలు దువ్వడంతో బాగా వైరల్ అవుతోంది.

 Viral Video Shock To See The Work Done By The Cat For The Dog-వైర‌ల్ వీడియో.. కుక్క కోసం పిల్లి చేసిన ప‌ని చూస్తే షాక్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోలో ఏమున్న‌దంటే.ఓ కుక్కకు పిల్లి నుంచి ప్రమాదం ఎర్ప‌డింది.

కుక్క, పిల్లి రెండూ ఒక‌దానితో ఒక‌టి పోరాడుతున్నాయి.అయితే, పక్కనే ఉన్న పిల్లి, వాటిని గమనించి కుక్కపై దాడి చేసిన సదరు పిల్లి.కుక్కను గోడపై నుంచి తోసేసింది.దీంతో బెంచ్ పై ఉన్న పిల్లి వెంటనే రంగంలోకి దిగి మరో పిల్లితో కొట్లాట‌కు సై అంటూ కాలు దువ్వి దానితో ఫైటింగ్ చేసింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది ఇష్టపడుతున్నారు.చాలామంది సోష‌ల్ మీడియా వాడ‌కం దార్లు దానిపై ఫన్నీ కామెంట్‌లు చేశారు.

ఇంతకు ముందెన్నడూ ‘కుక్క, పిల్లి స్నేహాన్ని తాము చూసింది లేద‌ని ఒక నెటిజ‌న్ అలాగే ఇలా శత్రువులు కూడా స్నేహితులుగా ఉంటార‌ని ఈ వీడియో చూశాకే అర్థ‌మ‌వుతోంద‌ని మ‌రొక నెటిజ‌న్ కామెంట్ చేశారు.ఇక మ‌రో నెటిజ‌న్ అయితే పిల్లి ఏకంగా తన జాతితోనే గొడ‌వ పెట్టుకుని మరీ కుక్క ప్రాణాల‌ను కాపాడింది’ అంటూ చెబుతున్నారు.ఇలా ఒక్క‌క్క‌రు ఒక్కో విధంగా కామెంట్లు పెడుతున్నారు.రెక్స్ చాప్‌మన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ కామెడీ వీడియోను షేర్ చేశారు.ఈ ఫన్నీ వీడియో 6.5 లక్షలకు పైగా వ్యూస్‌తో ముందున్న‌ది.

#Fights Dog #Dog Friendship #Animals #Animals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు