వైరల్ వీడియో: హెయిర్ కటింగ్ ఎలా చేసారో చూస్తే.. మీ పొట్ట చెక్కలవుతుంది..!

కరోనా విజృంభించి దాదాపు 2 ఏళ్లు కావొస్తుండగా.ఇప్పటికీ చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు.

 Viral Video See How Hair Cutting Is Done In A Very Funny Way, Viral Latest, News-TeluguStop.com

అత్యవసరమైతే తప్ప ఇంటి బయట అడుగు పెట్టడం లేదు.ఇంట్లో సంపాదించే వ్యక్తులు మాత్రం టీకాలు తీసుకొని తమ పనులు చేసుకుంటున్నారు.

గతంతో పోల్చుకుంటే చాలా దేశాల్లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలావరకు తగ్గుముఖం పట్టింది.అయినప్పటికీ చాలామంది ప్రజలు జిమ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, బార్బర్‌షాప్‌లు, బ్యూటీ సెలూన్లు, సినిమా థియేటర్లకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు.

ముఖ్యంగా కటింగ్ షాపులలో వైరస్ ఉండే ప్రమాదం ఎక్కువని ప్రజలు భావిస్తున్నారు.వైద్యులు కూడా కటింగ్ షాపులకు వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

దాంతో ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని చాలామంది ఇళ్లల్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కటింగ్‌ చేయించుకుంటున్నారు.

ఇక తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణ కోసం హెయిర్ కటింగ్ సైతం నేర్చుకుంటున్నారు.

అయితే కొందరు కష్టపడకుండానే చాలా వినూత్నంగా హెయిర్ కటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.మరికొందరు ఎవరూ ఊహించని రీతిలో గిన్నెలు, కటారీలు ఉపయోగిస్తూ ట్రిమ్మర్లతో కటింగ్ చేస్తూ కడుపుబ్బా నవ్వించేస్తున్నారు.

తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ కుటుంబ సభ్యులు తమ బాలుడికి ఇంట్లోనే కటింగ్‌ చేయడం చూడొచ్చు.

బాలుడి తలపై ఒక గిన్నె లాంటిది పెట్టి పర్ఫెక్ట్ షేప్ లో ట్రిమ్మర్‌తో కటింగ్‌ చేయడం చూడొచ్చు.ఆ బాలుడు తన మెడ చుట్టూ నల్లటి ఆప్రాన్‌ను ధరించి కదలకుండా కూర్చోవడం కూడా గమనించవచ్చు.కటింగ్ చేసిన తర్వాత బాలుడి తల విచిత్రం గా కనిపించింది.అచ్చం డిప్ప కట్టింగ్ లా ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు పగలబడి నవ్వడం స్టార్ట్ చేశారు.

పాపం ఆ బాలుడు సిగ్గుతో అక్కడినుంచి ఉడాయించాడు.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.

అది వెంటనే వైరల్ గా మారింది.దీనిని ఇప్పటికే 8 లక్షల మందికి పైగా వీక్షించారు.

దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.తమ పిల్లలపై కూడా ఇదే ట్రిక్ వాడుతాం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube