వైరల్ వీడియో: ప్రధాని మోడీ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన పిల్ల జాతిరత్నలు..!

క‌రోనా సెకండ్ వేవ్ ఉప్పెన‌లా విజృంభిస్తోంది.ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రిపై ప్ర‌భావం చూపిస్తుంది.

 Viral Video School Children Bumper Offer To Pm Narendra Modi In Corona Crisis, V-TeluguStop.com

ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం.ఇందుకోసం సామాజిక దూరం పాటిస్తూ వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే ఉండాలి.

కానీ అలా ఇంటిప‌ట్టున ఉండ‌టం వ‌ల్ల ఇప్పుడు కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయి.ముఖ్యంగా పిల్ల‌ల మాన‌సిక ఆరోగ్యంపై కూడా ఇది చాలా ప్ర‌భావం చూపిస్తుంది.

స్కూళ్లు బంద్ కావ‌డంతో పిల్ల‌లు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సి వ‌స్తుంది.ఫ్రెండ్స్‌తో ఆడుకోవ‌డం కానీ, ముచ్చ‌ట్లు పెట్ట‌డం కానీ చేయ‌లేక‌పోతున్నారు.

దీనివల్ల వారు మానసికంగా కుంగిపోయే ప్ర‌మాదం ఉంది.కాబ‌ట్టి వాళ్ల‌ను మాన‌సికంగా దృఢంగా ఉంచ‌డం చాలా అవ‌స‌రం.

లాక్ డౌన్ వల్ల దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.స్కూళ్లు, కాలేజీలు అన్నీ క్లోజ్ చేసేశారు.

అయితే, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ క్లాస్‌లు లేని విద్యార్థులైతే రీల్స్ చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు.

తాజాగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో పిల్లలు మాట్లాడిన మాటలు వింటే బాప్‌ రే అనాల్సిందే.కరోనా కారణంగా ప్రైమరీ స్కూళ్లు మూసివేసిన విషయం తెలిసిందే.దాంతో గ్రామాల్లోని విద్యార్థులు చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు.ఈ వీడియోలో విద్యార్థులు స్కూళ్లు మూసివేతకు సంబంధించి ఏకంగా ప్రధాని మోదీకే ఆఫర్ ఇచ్చారు.‘‘కరోనా కారణంగా మా చదువులను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

ప్రధాని నరేంద్ర మోదీ గారూ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏడు సంవత్సరాలు పాఠశాలను మూసివేయాల్సి వస్తే మూసివేయండి.మాకు ఎలాంటి సమస్య లేదు.చదువులను త్యాగం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.’’ అని వ్యాఖ్యానించారు.వారి అమాయకపు మాటలు వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube