వైరల్ వీడియో: ఆకాశానికి ఎగిసిన సమోసా..!  

చాయ్ వాలాపేరిట ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ అంటూ ఇంగ్లాండ్ లోని బాత్ అనే సిటీలో భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపిస్తున్నారు నీరజ్ గాదెర్.నిజానికి చాయ్ వాలా రెస్టారెంట్ బాత్ సిటీలో బాగా పాపులర్ అయింది.

TeluguStop.com - Viral Video Samosa Blown Into The Sky

ఇంగ్లాండ్ ప్రజలకు మన ఫాస్ట్ ఫుడ్ విపరీతంగా నచ్చడంతో నీరజ్ అక్కడే స్థిరపడిపోయి తన రెస్టారెంట్ నిర్విరామంగా నడిపిస్తున్నారు.అయితే తనకు ఇష్టమైన స్నాక్ అయిన సమోసా ని అంతరిక్షం లోకి పంపించాలని నీరజ్ సరదాగా అనుకున్నారట.

ఈ కరోనా సమయంలో నీరజ్ తనకు సరదాగా వచ్చిన అంతరిక్షంలో-సమోస అనే ఆలోచనను ఎందుకు ఆచరణలో పెట్టకూడదని అనుకున్నారట.

TeluguStop.com - వైరల్ వీడియో: ఆకాశానికి ఎగిసిన సమోసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

సమోసా ని అంతరిక్షంలోకి పంపిస్తే జనాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నవ్వుకుంటారని జనాల నవ్వుకు కారణం కావడం కూడా ఓ గొప్ప విషయమేనని ఆయన వెంటనే సమోసా ని అంతరిక్షంలోకి పంపించడానికి రెడీ అయిపోయారు.

రెండు హీలియం బెలూన్లతో పాటు జీపీఎస్ ట్రాకర్, గో-ప్రో కెమెరా తెచ్చుకున్న నీరజ్ తన రెస్టారెంట్ లో తయారైన సమోసా ని ప్యాక్ చేసి అంతరిక్షంలోకి పంపించాలి అనుకున్నారు.పరికరాలను గట్టిగా అమర్చి హీలియం బెలూన్ లతోపాటు ఓ సమోసా ను అంతరిక్షంలోకి వదిలాడు.

అయితే హీలియం బెలూన్లు శరవేగంతో గాల్లోకి దూసుకుపోవడంతో.చాయ్ వాలా రెస్టారెంట్ లో తయారైన సమోసా కూడా ఆకాశంలో వయ్యారాలకు పోయింది.

అయితే దీని కంటే ముందే నీరజ్ గతంలో కూడా సమోసా ని అంతరిక్షంలోకి పంపించడానికి చాలా సార్లు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారట.దీనితో తన స్నేహితుల సలహాలు తీసుకొని ఈ సారి తన సమోసాను గగనానికి ఎగరవేశారు.నీరజ్ సమోసా ను ఎగరవేసే ప్రక్రియను షూట్ చేసి నెట్టింట విడుదల చేశారు.దీనితో సమోసా అంతరిక్షంలోకి ఎగరడమేంటి అని చాలామంది నెటిజన్లు ఆ వీడియో చూస్తూ నీరజ్ సృజనాత్మకతకు ఫిదా అయిపోతూ తెగ పొగిడేస్తున్నారు.

అయితే నింగిలోకి ఎగిరిన సమోసా లొకేషన్ తెలుసుకోవడానికి జిపిఎస్ అమర్చగా.అది ఓ రోజు పాటు పని చేయలేదు.తర్వాత రోజు మాత్రం సమోసా యొక్క ఆచూకి ఫ్రాన్స్ లోని ఒక ఫారెస్ట్ ఉన్నట్టు జీపిఎస్ ట్రాకర్ తెలిపింది.అయితే శరవేగంతో ఆకాశం వైపు దూసుకు వెళ్ళిన సమోసా ఎక్విప్మెంట్ మధ్యలో క్రాష్ అయ్యి ఫ్రాన్స్ దేశంలోని ఫారెస్ట్ లో పడి ఉంటుందని తెలుస్తోంది.

కొందరు నెటిజనులు ఫారెస్ట్ లో శోధించి బెలూన్ తో పాటు జిపిఎస్, గో-ప్రో కెమెరా కనుకొన్నారు కానీ సమోసా మాత్రం దొరకలేదు.

.

#Samosa #Soical Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Samosa Blown Into The Sky Related Telugu News,Photos/Pics,Images..