వైరల్ వీడియో: రైతన్న నీకు వందనం...!

రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడు. రైతు పడే కష్టం గురించి చెప్పాలంటే వర్ణనాతీతం.

 Amputee Farmer Works In Fields , Viral Video, Social Media, Indian Forest Office-TeluguStop.com

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా పలకదు కొన్నిసార్లు.కానీ వారు పండించిన పంటతో మాత్రం అందరి కడుపులు నింపాలి అనుకుంటాడు రైతు.

ఇక ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న, పటించుకోకున్న వారు మాత్రం పంటను పండిస్తూనే ఉంటారు.బ్యాంకులు వద్ద లోన్స్ తీసుకోని కట్టలేకపోతున్న.

బ్యాంకు అధికారులు ఇంటి చుట్టూ తిరుగుతున్న వారు ఇవి ఏవి పటించుకోకుండా పంటను పండించడంపై దృష్టి పెడుతారు.రైతన్న దేవుడిపై భారం వేసి అడుగు ముందుకు వేస్తుంటాడు.

వారు తీసుకున్న రుణాలకు ఈ ఏడాది కాకుంటే వచ్చే సంవత్సరం కట్టుకోవచ్చు అని భవిస్తూ వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు.

ఇక రైతు 99శాతం కష్టాన్ని నమ్ముకొని 1 శాతం మాత్రం అదృష్టాన్ని నమ్ముకుంటాడు.

అయితే ఆ అదృష్టం అతడిని వరిస్తుందో లేదో చెప్పలేము.ఇక ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.

ఒక రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ అర్థమవుతుంది.ఆయన ఓ దివ్యాంగుడు.

కానీ తన పొలంలో తానే పని చేయాలని అనుకున్నాడు.ఊత కర్ర సహాయంతో అతడు పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు.

అతను తల పాగా చుట్టుకొని చేతిలో పార పట్టుకొని పొలంలో మట్టి తీసుకుంటూ వెళ్ళాడు.అయితే ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ మధుమిత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ వీడియోకి లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆమె తెలిపింది.అంతేకాకుండా 2600కు పైగా కామెంట్స్ వచ్చాయని అన్నారు.

అంతేకాకుండా 16వేల మంది వీడియోను లైక్ చేసినట్లు తెలిపింది.అయితే రైతుకు సంబంధించిన వివరాలు తన దగ్గర లేవని మధుమిత తెలిపారు.

ఈ వీడియోను చూసిన వారంత రైతన్న నీకు సలాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube