వైరల్ వీడియో: మంచు దుప్పట్లో సహారా ఎడారి..!

సాధారణంగా జనవరి మాసం వచ్చిందంటే చాలు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో మంచు అడుగులమేర రోడ్లను, ఇళ్లను కప్పేస్తుంది.ఎక్కడ చూసినా కూడా మంచు నురుగులు కనబడుతూ ఉంటాయి.

 Snow Falling, Sahara Dessert, Viral Latest, Viral Video, Vehicles, Cars, House,-TeluguStop.com

ఇల్లు, కార్లు, వస్తువులు, రోడ్లు ఇలా అన్నిటిపై మంచు కురవడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇక రోడ్లపై వాహనాలు నడపాలంటే అతి కష్టమైన పనిలా మారుతుంది.

జాగ్రత్తలు పాటించకపోతే ఎన్నో అనుకుని అవాంఛనీయ సంఘటనలు ఎదురుకుంటాము.

ఇక సహారా ఎడారిలో అయితే ఏ కాలం అయినా కానీ తీవ్రస్థాయిలో ఎండలు ఉంటాయి.

ఎడారిలో ఏ ప్రాంతం చూసిన కానీ ఇసుక మాత్రమే దర్శనం ఇస్తుంది.నీరు కూడా ఎక్కడో కనిపిస్తుంది.కానీ, మంచు మాత్రం ఎట్టి పరిస్థితిలో కనపడదు.కాకపోతే, ప్రస్తుతం అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం అక్కడ ప్రజలను సంబర ఆశ్చర్యాలకి గురి చేస్తోంది.

ప్రస్తుతం అక్కడ మంచు కురవడంతో అక్కడి ప్రజలు అందరూ ఒక్కసారిగా ఆనందంతో గంతులు వేస్తున్నారు.అంతేకాకుండా అక్కడ ఎడారిలో బంగారు వర్ణంలో ఉండే ఇసుక తిన్నెలు మొత్తం కూడా శ్వేత వర్ణం లోకి మారిపోవడం మనం చూడవచ్చు.ఈ సందర్బంగా అక్కడి ప్రజలు మంచు కురిసిన ఇసుకను చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా అల్జీరియాలోని ఎడారి పట్టణం ఐన్ సెఫ్రాకు దగ్గరగా ప్రాంతాన్ని మంచు దుప్పటిలో ముంచేసింది.

అక్కడ ఉష్ణోగ్రత -3 డిగ్రీలకు పడిపోవడంతో ఎప్పుడు ఊహించని దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు వారి కెమెరా లలో బందిస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube