వైర‌ల్ వీడియోః రైడ‌ర్‌గా మారి కుర్రాళ్ల‌కు పోటీ ఇస్తున్న స‌ద్గురు..!

లైఫ్ ఎలా ఉండాలి? ఏ తప్పులు చేయొద్దు? ఏ డెసిషన్స్ ఏ టైమ్‌లో తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలతో పాటు పలు విషయాల గురించి నీతి ప్రవచనాలు చెప్పే సద్గురు సడన్‌గా రైడర్ అయిపోయారు.మోడ్రన్ మాంక్‌గా మారి లుక్స్ చేంజ్ చేశారు.

 Viral Video Sadhguru Who Becomes A Rider And Competes With Guys, Sadguru, Bike R-TeluguStop.com

స్పోర్ట్స్ జాకెట్ ధరించి, హెల్మెట్ పెట్టుకుని యంగ్ మ్యాన్‌లా బైక్ రైడ్ చేసి ఉర్రూతలూగించారు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగవైరలవుతోంది.

వీడియోలో ఆయన బైక్ స్పీడ్ చూస్తే మీరు థ్రిల్ అవుతారనడంలో ఆశ్చర్యం లేదు.ఎందుకంటే ఆయ‌న చేసిన ప‌ని ఇప్పుడు అంద‌రినీ మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.

ఇటీవల విదేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగొచ్చారు సద్గురు.ఆయన ఎయిర్ పోర్టు నుంచి కోయంబత్తూరులోని ఇషా యోగి సెంటర్‌కు బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చారు.ఆ వీడియోను ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఇషా ఫౌండేషన్‌ ద్వారా సద్గురు యోగ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

తమిళనాడులోని కోయంబత్తూరు ఔటర్ ప్రాంతంలో ఇషా ఆశ్రమం ఉండగా, అక్కడ 112 అడుగుల భారీ పరమశివుడి, ఆది యోగి విగ్రహాన్ని నిర్మించారు సద్గురు.కోయంబత్తూరులో నిర్మించిన ఆది యోగి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విగ్రహం.

ఇక ఇషా ఫౌండేషన్ మన దేశంలోనే కాదు వేరే దేశాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.అక్కడ ఫౌండేషన్‌కు మంచి పేరు కూడా ఉంది.యోగా నిర్వహణ మాత్రమే కాకుండా పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలనూ ఇషా ఫౌండేషన్ నిర్వహిస్తుంది.ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, ఉగాండా, ఇంగ్లాండ్, అమెరికా వంటి పలు దేశాల్లోని ప్రజలు సద్గురు వాసుదేవ్ చేసిన పలు కార్యక్రమాలను చూసి అభిమానులయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube