వైరల్ వీడియో: రైలు కింద పడబోయిన మహిళను చాకచక్యంతో కాపాడిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్..!

ప్రస్తుత రోజుల్లో చాలామంది అన్ని ప్రయాణాల కంటే రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుందని దానికే మక్కువ ఎక్కువ చూపుతూ ఉంటారు.అయితే రైలు ప్రయాణం చేసే క్రమంలో కొంతమందికి  అనుకోకుండా కొన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.

 Viral Video Rpf Constable Cleverly Rescues Woman Who Fell Under Train-TeluguStop.com

రైలు ఎక్కే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్లాట్ ఫామ్ నుంచి రైల్వే ట్రాక్ పై కింద పడి పోవడం లాంటివి జరగడం మనం ఎన్నో వీడియోలలో గమనించాం.తాజాగా అచ్చం అలాంటి సంఘటన ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితేనసీమా బేగం అనే ఒక మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కుతున్న సమయంలో అదుపుతప్పి ఫ్లాట్ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది.ఇది  గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాలా చాకచక్యంగా ఆ మహిళ ప్రాణాలను కాపాడాడు.

 Viral Video Rpf Constable Cleverly Rescues Woman Who Fell Under Train-వైరల్ వీడియో: రైలు కింద పడబోయిన మహిళను చాకచక్యంతో కాపాడిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంఘటనలో భాగంగా సదరు మహిళ స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణాలను దగ్గించుకుంది.ఎంతో సాహసం చేసి ఆ మహిళ ప్రాణాలను కాపాడిన సదరు కానిస్టేబుల్ దినేష్ సింగ్ పై  రైల్వే స్టేషన్ ఉన్నతాధికారులు, నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా సంఘటన జరిగిన సమయంలో రైలులో  ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి చైన్ లాగడంతో రైలు కాస్త సమయం పాటు నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.అయితే సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వేస్టేషన్ లో ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ అవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.దీంతో ఆ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి అయితే రైలు ఎక్కే సమయంలో కానీ, రైలు దిగే సమయంలో కానీ కాస్త అప్రమత్తంగా ఉంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోమని పలువురు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

#Viral Video #Woman Life #Dinesh Singh #Social Media #Save

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు