వైరల్ వీడియో: మరోసారి సర్కస్ ఫీట్ చేసిన రిషబ్ పంత్..!

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన చలాకీతనంతో మైదానంలో ఉన్నంతసేపు నవ్వుల పూయిస్తారు.ఆయన ప్రతి మ్యాచ్లో ఇండియన్ టీం ప్లేయర్స్ లో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు.

 Viral Video Rishab Pant Done Another Stunt In Ishanth Sharma Bowling-TeluguStop.com

ముఖ్యంగా విపరీతమైన జోకులు చేస్తూ బౌలర్లలో ఎంతగానో జోష్ నింపుతుంటారు.అయితే అహ్మదాబాదులో ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రిషబ్ పంత్ తనదైన శైలిలో ఒక ఆక్రోబాట్ స్టంట్ చేసి అందర్నీ నవ్వించారు.

వివరంగా తెలుసుకుంటే.ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ విసిరిన బంతిని క్యాచ్ పట్టుకునే క్రమంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కింద పడ్డాడు.అయితే సాధారణంగా ఏ క్రికెట్ ప్లేయర్ అయినా బంతి పట్టుకునే క్రమంలో కింద పడిపోతే మామూలుగా లేచి నిల్చుంటాడు కానీ రిషబ్ పంత్ మాత్రం ఒక ఫైట్ మాస్టర్ వలే చేతులను నేల మీద పెట్టి గాల్లో ఎగిరి తన కాళ్ల మీద నిలుచున్నారు.అయితే ఈ స్టంట్ చూసిన విరాట్ కోహ్లీ స్టంట్, ఇస్తాంత్ శర్మ తో పాటు కామెంటరీ చెప్పే అజిత్ అగార్కర్, డీప్ దాస్ గుప్తా కూడా బాగా నవ్వుకున్నారు.

 Viral Video Rishab Pant Done Another Stunt In Ishanth Sharma Bowling-వైరల్ వీడియో: మరోసారి సర్కస్ ఫీట్ చేసిన రిషబ్ పంత్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేక్షకులు కూడా రిషబ్ పంత్ స్టంట్ కి ఫిదా అయిపోతూ చప్పట్లు కొట్టారు.

అయితే రిషబ్ పంత్ చేసిన ఈ స్టంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఇలా గాల్లో ఎగరాలంటే ఫిట్నెస్ లెవల్స్ హై లో ఉండాలి.కేవలం స్టంట్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్ లు, మార్షల్ ఆర్టిస్ట్ మాత్రమే ఇటువంటివి చేయగలరు.కానీ మన క్రికెటర్ రిషబ్ పంత్ సునాయాసంగా ఈ ఆక్రోబాట్ చేసి తన ఫిట్నెస్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్పారు.ఇకపోతే ఇంగ్లాండ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులు చేయగా.

బెన్ స్టోక్స్ 55 పరుగులతో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచారు.

#Viral Video #Standing #Risab Panth #Match Series #Stunt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు