వైరల్ వీడియో: రావణుడికి ఏమైంది..?!  

Ravana Infected with Covid,viral video, ravana, dasara festival special, covid hosipital, ravana covid postive, ias officer, social media, twitter - Telugu Covid Hosipital, Dasara Festival Special, Ias Officer, Ravana, Ravana Covid Postive, Social Media, Twitter, Viral Video

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైనా సమయంలో చాలా మంది వారి పరిసరాల్లో ఉన్న వాటిని వీడియో లేదా ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా ఎన్నో వీడియోలు వైరల్ గా మారుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.వాటిలో కొన్నింటిని చూస్తే ఇది ఏంటి రా బాబు కొత్తగా ఉంది అని అనుకుంటూనే ఉంటారు.

TeluguStop.com - Viral Video Ravana On Ambulance Infected With Covid

మరికొన్ని అబ్బో ఏమన్నా ఉందా అంటూ తెగ మెచ్చుకుంటూ ఉంటాము.మరి కొన్ని వీడియోలు కన్నీళ్లను పెట్టిస్తాయి.

అయితే మీరు ఇప్పుడు చూడబోయే వీడియో మాత్రం ఏ కేటగిరీకి చెందుతుందో మీరే డిసైడ్ అవ్వండి.ఇక అసలు విషయంలోకి వెళితే.

TeluguStop.com - వైరల్ వీడియో: రావణుడికి ఏమైంది..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం దసరా పండగ జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ రావణ దహనం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.దేశంలో ఇలాంటి సంస్కృతి ఎక్కువగా ఉత్తరభారతదేశంలో చేస్తూ ఉంటారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రావణాసురుడి దిష్టిబొమ్మను తయారు చేయగా దానిని గమ్యస్థానానికి చేర్చడానికి చేసిన విధానం నెటిజన్లను ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.రావణ దహనానికి తయారుచేసిన రావణాసురుడి బొమ్మను ఓ అంబులెన్సు మీద ఆ బొమ్మను పెట్టి తరలిస్తున్నారు.

అలా అంబులెన్సు పైన ఆ రావణాసురుడి బొమ్మను కట్టిపడేసారు.

ఇలా రావణాసురుడి బొమ్మను తరలిస్తున్న సమయంలో అంబులెన్సు పక్కన కార్ లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఈ వీడియోని తీశారు.

ఇందుకు సంబంధించి తాజాగా భారతదేశ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేయగా అందుకు ” 2020 రావణుడు అంబులెన్స్ మీద కోవిడ్ ఆస్పత్రికి వెళ్తున్నాడు అంటూ ట్యాగ్ క్రియేట్ చేశాడు”. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరో ఓ వ్యక్తి ఈ వీడియోని షేర్ చేస్తూ రావణాసురుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటూ పోస్ట్ చేశారు.ఇలా నెటిజెన్స్ వారికి ఇష్టమొచ్చినట్టు వారి స్టైల్ లో ఈ వీడియోకి క్యాప్షన్స్ పెడుతున్నారు.

#DasaraFestival #Ravana #Viral Video #RavanaCovid #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Ravana On Ambulance Infected With Covid Related Telugu News,Photos/Pics,Images..