వైరల్ వీడియో: గంటపాటు డబ్బుల వర్షం.. ఎక్కడో తెలుసా..?!

మనకు తెలిసినంత వరకు చేపల వర్షం, వడగండ్ల వర్షం అని చాల సార్లు చూశాం విన్నాము.ఇక పూర్వకాలంలో రాజులు కాసుల వర్షం కురిపించే వాళ్ళు అని పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం.

 Viral Video Rain Of Money For An Hour Do You Know Somewhere  Viral Video, Money,-TeluguStop.com

అయితే నేటి సమాజంలో డబ్బు కోసం సొంతవారినే చంపేసుకుంటున్నారు.ఇలాంటి రోజుల్లో ఆ దేశంలో గంటపాటు డబ్బుల వర్షం కురిసింది.

ఇక ఆ డబ్బులు వర్షం కురిసింది మన పక్క దేశమైన పాకిస్తాన్ లో ఈ మాట వింటే మీరు షాక్ అవ్వుతున్నారు కదా.అవును పేద దేశం పాకిస్తాన్ లో విచిత్రంగా డబ్బుల వర్షం కురవడం అందరికీ షాక్ ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నరోవాల్‌ లో ఇటీవల ఓ వివాహం జరిగింది.ఈ పెళ్ళికి చాలా మంది బంధువులు కూడా హజారయ్యారు.

అయితే వధువువరులు ఇద్దరూ ఇంటి కింద నిల్చుని ఉన్నారు.ఆ తర్వాత నవ్రా దేవా కుటుంబ సభ్యులు డాబా ఎక్కారు.

అంతలో డాబా మీద నుంచి లక్షల నోట్లను గాల్లోకి విసిరారు.దీంతో ఈ నవ దంపతులపై నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది.

అంతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుపై పెద్దలు అక్షితలు జల్లినట్లుగా కరెన్సీని చల్లారు.అవి గాలిలో ఎగురుతూ కిందపడ్డాయి.

ఇక డబ్బులు అలా కింద పడుతుంటే ఆ ప్రాంత ప్రజలు పైసా అంటూ వాటిని పట్టుకున్నారు.అక్కడ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ఈ ఘటన పాకిస్థాన్ లో నోట్ల వర్షం అంటూ వైరల్ అయ్యింది.నెట్టింట్లో వీడియో హల్ చల్ చేస్తుంది.

ఇంతకీ ఆ నోట్ల వర్షం ఎంత అంటే దాదాపు రెండు లక్షల రూపాయాలు అని తెలిసింది.

అసలే ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ లో ఈ రేంజ్ లో పెళ్లిళ్లు చేసే స్టేజ్ లో ప్రజలు ఉన్నారా ? అనే చర్చ ప్రారంభమైంది.అయితే పెళ్లి కొడుకు సోదరుడు అమెరికాలో ఉంటున్నాడు పెళ్లికోసమే పాకిస్థాన్ వచ్చినట్లు తెలిసింది.తమ ఇంట్లో పెళ్ళికి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.అందుకనే ఆ డబ్బుని ఇలా వర్షంలా వేశాడట ఆ డబ్బుని తీసుకున్న పేదవారు ఎంతో సంతోష పడ్డారు.ఇలాంటి పెళ్లిని సందర్భాన్ని ఇప్పటి వరకూ చూడలేదని వారు అభిప్రాయాన్ని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube