వైరల్ వీడియో: అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టిన రహనే..?- Viral Video Rahane With A Wonderful Speech

viral video rahane with a wonderful speech, rahane, Australia cup, viral video, speech, social media, Indian players, test match victory - Telugu Australia Cup, Indian Players, Rahane, Social Media, Speech, Test Match Victory, Viral Video

ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియాపై టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సగర్వంగా తీసుకుంది.ఈ సిరీస్ లో ఆసీస్ ను టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే మనకి.

 Viral Video Rahane With A Wonderful Speech-TeluguStop.com

ఈ సిరీస్ లో భాగంగా ముఖ్యంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.నాలుగు టెస్టుల్లో ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్ లాగా ఆస్ట్రేలియాను గబ్బా స్టేడియంలో మట్టికరిపించి చారిత్రాత్మక విజయం అందుకుంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత ఆటగాళ్లను మాటలతో ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎలాంటి స్లెడ్జింగ్ చేయకుండా ఆటతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సమాధానమిచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.ఇక సిరీస్ లొ భాగంగా విజయం సాధించిన తర్వాత బోర్డర్-గవాస్కర్ కప్ అందుకున్న టీమిండియా కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది క్రీడా అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

 Viral Video Rahane With A Wonderful Speech-వైరల్ వీడియో: అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టిన రహనే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా…?!

తన కెప్టెన్సీ సారథ్యంలో టీమిండియా ఈ విజయం సాధించిన విషయం పురస్కరించుకొని డ్రెస్సింగ్ రూమ్ లో తన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.ఒక జట్టు కెప్టెన్ అంటే ఇలా ఉండాలి అనే లాగా అందరికీ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని రహానే ఇచ్చాడు.ఈ సిరీస్ లో భాగంగా ఆడిన ప్రతి ఆటగాడి పేరు ప్రస్తావిస్తూ అందరికీ అభినందనలు తెలియజేశాడు.

ఇందులో భాగంగానే రహానే మాట్లాడుతూ.తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత మిగిలిన మూడు మ్యాచ్ లలో ఆటగాళ్లంతా వారి ప్రాణం పెట్టి ఆట ఆడినట్లు తెలుపుతూ ప్రతి ఒక్క ఆటగాన్ని మర్చిపోకుండా పేరుపేరునా గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు అంటూ కొనియాడారు.

ఇది టీమిండియాకు ఓ గొప్ప విజయం అని అందరి కృషి వల్లే ఇంత గొప్ప విజయాన్ని నమోదు చేయగలిగాం ఆటగాళ్లపై రహానే ప్రశంసల వర్షం కురిపించాడు.రహనే తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఆటగాళ్లను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చి వారి అందరికీ అభినందనలు తెలిపాడు.

#Social Media #Speech #Australia Cup #Indian Players #Rahane

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు