వైరల్ వీడియో: జూ వ్యక్తి పై దాడి చేసిన కొండచిలువ..!

జూ.

అంటే చిన్నపిల్లలకి మహా సరదా.ఎందుకంటే జూ లో అన్నీ రకాల జంతువులు, పక్షులు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలు, పెద్దలు జూని సందర్శించడానికి మహా సరదా చూపిస్తారు.అయితే అలాంటి ఒక పాములు పెంచే జూలో ఉన్న ఒక కొండచిలువ అక్కడ ఉన్న వ్యక్తిపై దాడి చేసింది.

 Viral Video Python Attacked Zoo Keeper In California-TeluguStop.com

దీంతో అతడికి గాయాలు అయ్యాయి.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే కాలిఫోర్నియాలోని సరీసృపాల పార్క్ లో చోటు చేసుకుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Viral Video Python Attacked Zoo Keeper In California-వైరల్ వీడియో: జూ వ్యక్తి పై దాడి చేసిన కొండచిలువ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ కొండచిలువ పసుపు రంగులో నల్లటి చారలతో ఉంది.

అక్కడ పనిచేసే జూ కీపర్ జే.బ్రూవర్ ఆ కొండ చిలువ దగ్గరకి వెళ్ళాడు.అయితే ఆ కొండచిలువ గుడ్లు పెట్టి ఉంది.ఆ జూ కీపర్ ఆ కొండచిలువ పెట్టిన గుడ్లను తీసే ప్రయత్నం చేశాడు.పాములను పట్టుకునే కర్రతో కొండచిలువను కంట్రోల్ చేసి పాము ధ్యాసను మళ్లించి గుడ్లు తీయాలనే ప్రయత్నం చేసాడు.కానీ తన పిల్లల జోలికి వస్తే తల్లి ఊరుకుంటుందా చెప్పండి.

మనుషులకే కాదు జంతువులకు కూడా బిడ్డల మీద ప్రేమాభిమానులు ఉంటాయి అని ఈ కొండచిలువను చూస్తే అర్ధం అవుతుంది.

ఈ జూ కీపర్ ఎప్పుడయితే కొండచిలువ పెట్టిన గుడ్లను తీసే ప్రయత్నం చేస్తున్నాడో అప్పుడు కొండచిలువ అలెర్ట్ అయింది.

అది గ్రహించలేని జూ కీపర్ ఆ సమయంలో తన చేతిలోని స్టిక్ ను పక్కకు పెట్టి గుడ్లు తీస్తున్నాడు.అది గమనించిన కొండ చిలువ ఒక్కసారిగా అతడి ముఖం మీద దాడి చేసింది.దీంతో అతడి ముఖంపై రక్తపు గాయాలయ్యాయి.ప్రస్తుతం దీనికి సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కొండచిలువ పెట్టిన గుడ్లను ఇంక్యూబేటర్ లో పెట్టేందుకు వాటిని తీస్తున్న సమయంలో ఈ పాము తనపై దాడి చేసినట్లు తెలిపాడు బ్రూవర్.ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకే లైకులు, కామెంట్స్ పెద్ద ఎత్తున వచ్చాయి.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.

#Python Attacked #Attack #Phython #ZooKeeper #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు