వైరల్ వీడియో: ఎంత అందంగా స్కిప్పింగ్ చేస్తున్నారో కదా…!  

Pyramid Wheel Freestyle Jump Rope Viral Video,Pyramid Wheel Freestyle Jump Rope , Zorawar Singh,jump rope athlete,skipping ropes, - Telugu Jump Rope Athlete, Netizans, Pyramid Wheel Freestyle Jump Rope, Pyramid Wheel Freestyle Jump Rope Viral Video, Pyramind Prestyle Jump Roap, Ropes, Skipping Ropes, Skkiping, Viral Video, Zorawar Singh

కరోనా వైరస్ పుణ్యమా అంటూ భారతదేశంలో సినిమా హాల్స్ , జిమ్స్, పార్క్స్ ఇలా చాలా వాటిపై లాక్ డౌన్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.ప్రస్తుత కాలంలో చాలా మంది వారు ఫిట్ గా ఉండేందుకు జిమ్ బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Viral Video Pyramid Wheel Freestyle Jump Rope

ప్రస్తుతం అన్ లాక్ సడలింపులు కారణంగా జిమ్ లు తెరుచుకున్నా చాలామంది కరోనా వైరస్ కు భయపడి అటువైపు వెళ్లట్లేదు.దీంతోనే ఆన్లైన్ లో క్లాసులు వింటూ ఇంట్లో ఉండి వ్యాయామాలు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది.

ఇక ఇంట్లో వ్యాయామంతో పాటు స్కిప్పింగ్ కూడా కాస్త వీలుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.వ్యాయామం, స్కిప్పింగ్ చేయడం ద్వారా మన శరీరం ఫిట్ గా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

TeluguStop.com - వైరల్ వీడియో: ఎంత అందంగా స్కిప్పింగ్ చేస్తున్నారో కదా…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అసలు విషయంలోకి వెళ్తే….

అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన రోప్ జంప్ అథ్లెట్ జొరవర్ సింగ్ తన మిత్రులతో కలిసి వివిధ స్టైల్స్ లో స్కిప్పింగ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ నిజంగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.వారు చేసిన వివిధ విన్యాసాలు చూసి వావ్ అంటున్నారు.

ఈ వీడియోలో వారు రోప్ లతో చాలా బాగా విన్యాసాలు చేశారు.

మొత్తం నలుగురు మిత్రులు కలిసి రెండు రోప్స్ తీసుకొని విన్యాసాలు చేసి ఔరా.అని అనిపించుకున్నారు.ఈ వీడియోలో మొదట్లో ఇద్దరు వ్యక్తులు కింద ఉండగా మరో ఇద్దరు వారిపై ఎక్కి మరి స్కిప్పింగ్ చేయడం నిజంగా అద్భుతం.

అలా చేసిన తర్వాత ఆ ఇద్దరు కిందికి దిగి మళ్లీ డాన్స్ చేసినట్లుగా చేసిన స్టంట్స్ నిజంగా అమోఘం.ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించి నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున కామెంట్లు అందుకుంటున్నారు.

ఇక ఈ వీడియో కి సంబంధించి జొరవర్ సింగ్ మాట్లాడుతూ ఈ కఠినమైన ప్రక్రియ కోసం తాము ఆరు సంవత్సరాలు కఠిన సాధన చేసిన తర్వాత ఈ ‘ పిరమిడ్ ఫ్రీస్టైల్ జంప్ రోప్’ చేయగలిగినట్లు ఆయన తెలియజేశారు.

#Viral Video #Skkiping #Skipping Ropes #Ropes #PyramidWheel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Pyramid Wheel Freestyle Jump Rope Related Telugu News,Photos/Pics,Images..