వైరల్ వీడియో: వాటిని చూసి అధ్బుతం అంటున్న ప్రధాని మోడీ..!

కృష్ణ జింక.పేరు మీరు వినే ఉంటారు.

 Viral Video Prime Minister Modi Says It Is Wonderful To See Them-TeluguStop.com

ఎందుకంటే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక పేరు గాంచింది కాబట్టి.

కృష్ణజింకలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేము.అందంతో పాటు వేగంగా పరుగెత్తటంలో కూడా ఇవి ఈ జంతువులకు సాటి రావు.

 Viral Video Prime Minister Modi Says It Is Wonderful To See Them-వైరల్ వీడియో: వాటిని చూసి అధ్బుతం అంటున్న ప్రధాని మోడీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కృష్ణ జింకలకు మాములు జింకల వలె కొమ్ములు ఉండవు.ఈ జింకలు ఎప్పుడు కూడా గుంపులవలె మాత్రమే తిరుగుతాయి.

ఒక్కటిగా అసలు ఉండవు.ఇప్పుడు ఈ కృష్ణజింక గురించి ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.?! సోషల్ మీడియాలో ఈ కృష్ణ జింకలకు సంబందించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోను ఇప్పటి దాక పెద్ద ఎత్తున నెటిజన్లు చూసి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

ఇంతటి అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది మరెవరో కాదు.సాక్షాత్తు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.ఒక అడవిలో వేల సంఖ్యలో కృష్ణజింకలు రోడ్డు దాటుతున్న వీడియోను ప్రధాన మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అడవుల్లో తిరిగే ఒక కృష్ణ జింకను చూడడమే మనకి చాలా అరుదైన విషయం.మరి అలాంటిది ఒకేసారి 3000 కృష్ణ జింకలను చూస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.

ఈ వీడియోను గుజరాత్ రాష్ట్రంలో ఉన్న భావనగర్ లోని కృష్ణ జింకల జాతీయ పార్కులో తీయడం జరిగింది ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పోస్ట్ చేయగా దానిని మన ప్రధాని ట్వీట్ లో మనతో పంచుకున్నారు.ఇక ఈ వీడియోకు ‘అద్భుతం’ అనే ఒక క్యాప్షన్ కూడా పెట్టి మరి పోస్ట్ చేసారు.

ఈ వీడియోలో దాదాపు 3 వేల సంఖ్యలో కృష్ణ జింకలు ఒకదాని తరువాత ఒకటి లైన్ గా పైకి, కిందకి దూకుతూ రోడ్డు దాటడం మనం చూడవచ్చు.అన్ని కృష్ణ జింకలను ఒకేసారి చూడడంతో అందరు వాటిని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు.ఎందుకంటే అన్ని కృష్ణ జింకలను ఒకేసారి చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ భావాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.

అలాగే ఇంత అద్భుతమైన వీడియోను పోస్ట్ చేసిన నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియచేస్తున్నారు.ఈ వీడియోను ఇప్పటిదాకా వేల సంఖ్యలో చూసారు.మామూలుగా 15 నుండి 20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి.అందులో ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.

#Twitter #PM Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు