వైరల్ వీడియో: పరుగు పందెంలో నిండు గర్భిణీ..!

ఈ మధ్యకాలంలో ఆడవారు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి డెలివరీలు సక్రమంగా జరగడం లేదు.ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ మహిళలకి డాక్టర్స్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలంటూ సూచనలు ఇస్తున్నారు.

 Pregnant Woman Participated In Running Competition,running Competition, Training-TeluguStop.com

ఇది ఇలా ఉండగా ఓ నిండు గర్భిణి తాజాగా ఏకంగా ఓ పరుగుపందెంలోనే పాల్గొంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మకెన్నా మైలర్ అనే 28 ఏళ్ల ఒక క్రీడాకారిణి నిండు గర్భిణీ.అయితే తాజాగా ఆవిడ ఒక పరుగు పందాన్ని పెట్టుకుంది.

ఇందులో భాగంగానే ఆవిడ 1.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 నిమిషాల 25 సెకన్స్ లో అవలీలగా పూర్తి చేసింది.ఆ సమయంలో ఆమె భర్త అక్కడే ఉంటూ ఆమెను ప్రోత్సహించారు.నిజానికి 1.6 కిలోమీటర్ల దూరాన్ని ఆరోగ్యవంతులైన వ్యక్తులే పరిగెత్తడానికి సరాసరి పదినిమిషాల సమయం తీసుకుంటారు.కాకపోతే, ఈ తొమ్మిది నెలల నిండు గర్భిణీ ని మాత్రం అవలీలగా కేవలం 5 నిమిషాల 25 సెకన్లలోనే గమ్యాన్ని పూర్తిచేసింది.

ఎందుకు సంబంధించిన వీడియోను భర్త సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ఈ వీడియోలో పరుగు తర్వాత ఆమెను చూస్తే ఇలాంటి అలసిపోవడం కానీ శారీరక ఇబ్బంది పడటం కానీ ఎక్కడ లేకపోవడం గమనార్హం.

ఇందుకు సంబంధించి మైలర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కరోనా పరిస్థితులు వచ్చిన సమయంలోనే తాను గర్భం దాల్చడంతో తన ట్రైనింగ్ లో కొన్ని మార్పులను చేసుకున్నట్లు తెలిపింది.అయితే ఈ పరుగు పందానికి ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకుని ఈ పరుగుపందెంలో పాల్గొంది.

అలాగే తాను ఈ పరుగు పందెం ను పూర్తి చేస్తానని అసలు ఊహించలేదన్నారు .ఇదివరకు ప్రతివారం కష్టపడుతూనే ఉన్నానని అయితే ఇదే రన్నింగ్ తాను తొమ్మిది నెలలు కడుపు ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదని అనిపించడంతో తన మైండ్ సెట్ ను కూడా మార్చుకున్నట్లు తెలిపింది.అంతేకాదు, అక్టోబర్ 19న ఆమెకు డెలివరీ డేట్ ను ఇచ్చారు అక్కడి వైద్యులు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఇలాంటి ఫీట్ మరెవరు చేయలేరని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube