వైరల్ వీడియో: ఎంపీలనే పరుగులు పెట్టించిన చిట్టి ఎలుక..!

ప్రపంచంలో ఏ ప్రాణిని లైట్ తీసుకోవద్దు.ఎందుకంటే వాటికంటూ ఓ రోజు తప్పకుండా వస్తుంది.

 Viral Video Praliament Members In Spain Runs Seeing The Rat-TeluguStop.com

ఆ రోజు వాటిని చూసి అందరూ పరుగులు తీయాల్సిందే.ఆ ప్రాణి చిన్నదైనా.

పెద్దదైనా సరే.ఇకపోతే అలాంటి ఓ రోజే చిట్టి ఎలుకకు వచ్చింది.అధికారులను పరుగులు పెట్టించే ప్రజాప్రతినిధులనే ఓ ఎలుక పరుగులు పెట్టించింది.అది కూడా ఓ పార్లమెంట్ లో అంటే నమ్ముతారా.? అవును నిజం అండి.కానీ.

 Viral Video Praliament Members In Spain Runs Seeing The Rat-వైరల్ వీడియో: ఎంపీలనే పరుగులు పెట్టించిన చిట్టి ఎలుక..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది జరిగింది ఇక్కడ కాదు.ఓ పొరుగు దేశంలో.

పూర్తి వివరాల్లోకి వెళితే.

స్పెయిన్ లోని సెవిల్ ఆండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.

సభకు హాజరైన ఎంపీలందరూ వారి స్థలాలలో కూర్చుకొని ఉన్నారు.సభ అంతా నిశబ్దంగా ఉంది.

ఎంతో ముఖ్యమైన ఓ అంశంపై ఓటింగ్ జరుగుతోంది.ఇంతలోనే స్పీకర్ స్థానంలో ఉన్న మార్తా బోస్కెట్ మాట్లాడుతూ.

మాట్లాడుతూ.ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి ఓ వైపు తీక్షణంగా గమనిస్తున్నాడు.

ఏం జరిగిందో అని అక్కడ ఉన్న ఎంపీలు అందరూ అటు వైపు ఓ లుక్ వేశారు.అటు వైపు చూసిన వెంటనే ఎంపీలు పరుగులు తీయడం మొదలు పెట్టారు.

అల్లరిచిల్లరగా కుర్చీలు పడేసి గబాగబా టేబుళ్లపై ఎక్కి కూర్చున్నారు.ఇంతకీ వారు చూసింది ఏ పులినో కాదు.

పామునో కాదు.ఓ చిట్టి ఎలుకను.

అవును వారంతా ఎలుకను చూసి అది కరుస్తుందేమో అని భయంతో పరుగులు తీశారు.

ఇది గమనించిన సిబ్బంది అక్కడికి వచ్చి ఎలుకను తరిమేశారు.ఆ ఎలుక వెళ్ళిపోగానే హమ్మయ్య అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఎలుక బయటికి వెళ్ళగానే ఎంపీలు అందరూ చప్పట్లు కొట్టారు.

ఎంతో సీరియస్ జరుతున్న ఓ సభను ఓ చిట్టి ఎలుక డిస్టర్బ్ చేసింది.ఎంపీలను పరుగులు పెట్టించింది.

దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.ఈ వీడియో చూసిన కొందరు ఈ ఎలుక ఎంపీ లనే పరుగులు పెట్టించింది అంటూ తెగ నవ్వేసుకున్నారు.

#Spain #Members

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు